విశ్వ గురువు!!; -సునీతా -ప్రతాప్ ఉపాధ్యాయిని , పిఎస్ నంది వడ్డేమాన్ నాగర్ కర్నూల్ జిల్లా.
విషయము లేకుండా
చెప్పేవాడు
విషమిచ్చేవాడు ఒకటే!!?

విషయం రహస్యం
విప్పి చెప్పేవాడే గురువు!!

నిమిషా నిమిషం
వృధాగా గడిపేవాడు
కాడు గురువు!!?

ప్రతి నిమిషం
గడియారంలా
పని చేసేవాడు గురువు!!

విశ్వగురువు ఎవడు!!?
ధనవంతుడు కాడు
విశ్వ గురువు అంటే
విజ్ఞానవంతుడు!!!

విశ్వశాంతిని కోరేవాడు కాడు
మనశ్శాంతిని సంతోషాన్ని
పంచేవాడే ప్రపంచశాంతినిస్తాడు
వాడే విశ్వ గురువు!!!!

On the occasion of republic day
26th January

కామెంట్‌లు
Unknown చెప్పారు…
SUPER MADAM GURUVU GURINCHI CHALAA BAAGA CHEPPARU