పాడి - పంటలతో....
విలసిల్లిన పల్లెలు... !
నేడు కిట్టుబాటుకాని...
వ్యవసాయముతో....
బ్రతకలేక - చావలేక....
పట్టణాల బాటపట్టె
కూలీలై రైతులు...!!
అన్నదాతలందరూ....
వ్యవసాయము వదిలేస్తే
ఆహారములేకజనం...
అల్లాడిపోవరా.... !
ప్రభుత్వము ప్రోత్సహించి...
రైతులకు బ్రతుకునిచ్చి...
వ్యవసాయమునుద్దరించి
అందరికీ ఆహారం...
అందునటుల జేస్తేనే...
ఆనందోత్సాహాలు !!
*********
చిత్రానికి గేయం ; ... కోరాడ నరసింహా రావు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి