రవికానని చోటును
కవివర్యుడు కాంచును
రవియంటే కాంతి
కవియంటే భ్రాంతి
రవియంటే అహస్సుకధిపతి
కవియంటే అక్షరాలకూర్పరి
రవియంటే పద్మాలహితవరి
కవియంటే పదాలప్రయోగి
రవియంటే కిరణాలు
కవియంటే కవనాలు
రవియంటే ప్రకాశము
కవియంటే పరవశము
రవి ఒకదగ్గరినక్షత్రము
కవి ఒకవిఙ్ఞానస్థావరము
రవియంటే జగన్నాధునిరథము
కవియంటే సాహిత్యచైతన్యము
రవియంటే మేలుకొలుపు
కవియంటే హృదితలపు
రవియంటే హరివిల్లు
కవియంటే అక్షరజల్లు
రవియంటే తెల్లవారివెలుగు
కవియంటే తేటతెలుగుజిలుగు
రవియంటే విశ్వభ్రమణము
కవియంటే కల్పనాచాతుర్యము
రవియంటే రథస్వారి
కవియంటే మార్గదర్శి
రవియంటే వేడి
కవియంటే వాడి
రవి
రగులుతు వినువీధినవిహరిస్తాడు
కవి
కనిపించక విడమరచివినిపిస్తాడు
రవి
రకరకాలరంగుల విసురుతాడు
కవి
కలముపట్టి విషయాలువివరిస్తాడు
++++++++++++++++++++++++++
నన్నడిగిన ప్రశ్న:
ఎవరివో? నీవెవరివో?
రవివో? కవివో?
జ్వాలను రగిలిస్తావా!
మనసులు కదిలిస్తావా!!
నెనిచ్చిన జవాబు:
ఎను యొకకవిని
అక్షరాలను వెలిగించుతా
పదాలను ప్రకాశింపజేస్తా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి