అ అక్షర గేయం;--గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు
అమ్మ మొదటి గురువు
అయ్య కల్పతరువు
అరక రైతు నేస్తము
అలుపెరగని సేద్యము
     అక్షరాలు వెలుగు
     అజ్ఞానమే తరుము
    అమృత ధార తెలుగు
    అధరాలకు  మధురము
అలుపులేదు మనసుకు
అస్థిరత వయసుకు
అక్కరలో సాయము
అవసరమే న్యాయము
     అక్క అమూల్యము
    అన్న అపురూపము
     అవనిలో కుటుంబము
    అఖిల జగతి రూపము


కామెంట్‌లు