గీతా తత్త్వం (10)'- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.

 ఈ సమాజంలో క్షుద్ర జీవి మొదలు అగ్ర జీవి వరకు చేయు ప్రతి సంకల్పమును  తమ సుఖశాంతుల కొరకే అన్న విషయం ప్రతివారికి అనుభవంలో ఉన్నది  ఇంకా మానవ జాతిని గురించి ప్రత్యేకంగా చెప్పవలసిందేమి ఉంది  హిందూ సమాజంలో సుఖశాంతులను అన్వేషించుటకై  కొంతమంది ప్రత్యేకము ఒక వర్గమునే విభజించారు కదా ఒక్క భారతదేశంలోనే కాదు నేల నాలుగు చెరగుల నుంచి ఎందరో మేధావులు లేక ప్రవక్తలు మానవ సమాజము నిత్య సుఖాలు భూతిని పొందుటకు మార్గములన్ని కనిపెట్టి ప్రచారంలో పెట్టక పోలేదు కానీ దురదృష్టవశమున  ఆయా మార్గములన్నీ పరస్పర వ్యతిరేక మత సిద్ధాంతములు గారు పొంది మానవ సమాజంలో మరింత చీలికలు కల్లోలములు వర్షాంతి రక్తపాతములు కలిగించుటకు దారి తీసినవే కాక  కట్ట కడకు రెండు సిద్ధాంతములుగా ఏర్పడి మానవ సమాజంలో రెండుగా చీల్చి వచినది అని ప్రపంచ చరిత్ర స్పష్టముగా చెప్పుచున్నది  ఆ రెంటిలో ఒకటి భౌతిక సిద్ధాంతమును మరొకటి ఆధ్యాత్మిక సిద్ధాంతమును స్థాపించుటకై  నాటి నుండి నేటి వరకు విశ్వ ప్రయత్నలు చేయుచున్నవని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.
దానిలో భౌతిక వాదము ఇది. సకల దుఃఖములకు మూలము దరిద్రత. దానికి కారణం సోమరితనము దాని ఫలితం దేశపరాదీనత  దాని అనుభవం శాశ్వత బానిసత్వం దానికి మూలము మతము బ్రహ్మసత్యం జగత్ మిధ్యా అను జగత్ మిద్వైతవాదమును మరియు శుభాశుభములకు దైవమే కర్తయను దైవ వాదమును  మానవుని దృష్టిని ప్రత్యక్ష ఫలితము నిచ్చు ప్రపంచము వైపు నుంచి  ఆకాశము వైపునకు మళ్ళించినవి  శతాబ్దములుగా హిందూ సమాజమనే కాదు అనేక మానవ సమాజమునే అధోగతి మార్గములో నడిపించినది ఈ మతమే  అని వీరి వాదము  ఇక రెండవ వారి వాదనది  జగత్తు విద్య జీవితము అస్థిరము  విషయ వాంఛలు దుఃఖ మూలములు  ఆశకు అంతులేదు సకల సంపదలకు ఆలవాలమైనవి అని చెప్పబడు ఆమెరికా వంటి దేశములు సైతము  వారి సంపదను  కాలమును శక్తిని మారణ యంత్ర నిర్మాణములకై ఏల వృధా చేయుచున్నారు.
దురాశ చావకనే గాని తిండికి చాలక కాదు కదా. దీనిని బట్టియే భౌతిక వస్తు సముదాయములు సుఖశాంతులను కలిగించును కొనుట శుద్ధభివేకమనియు  వివేకి అయినవాడు ఈ దుఃఖమయ జగత్తునకు దూరముగా ఉండవలయునని స్పష్టపడుచున్నదని వీరు వాదించెదరు. ఒక విశ్వాసము మరొకరికి సుతరము గిట్టదు.  వేదాంతర దృష్టిలో భౌతిక  వాదులు అజ్ఞానులు ఆశ బూతులు భోగ లాలసులు  అదే విధముగా భౌతిక వాదుల దృశ్యలో వేదాంతలు అవివేకులుపరాన్న బుక్కులు  పరమ సోమరులు వీరు ఇరువురి సిద్ధాంతములకు తూర్పు పడమరలకు దూరం ఉన్నది  వీటిలో ఎవరివాదము సత్యము ఎవరి అసత్యము  వేదాంతల వాదమును భౌతిక వాదులు ఈ విధముగా ఖండించెదరు.


కామెంట్‌లు
Popular posts
చిత్రాలు ; ..జ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భారత్ నగర్ (మూసాపేట)- హైదరాబాద్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
చిత్రాలు ; జి.జీవనజ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భరత్ నగర్ హైదరాబాద్
చిత్రం
తెలివితేటలు!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం