కాపలాదారుని పిలిచి నేను వచ్చానని చెప్పి మీ స్వామీజీని బయటికి రమ్మను రా అని అధికార స్వరంతో చెప్పారు వారు ఏకాంత సేవలో ఉన్నారు ఇప్పుడు మాట్లాడరు మీరు తరువాత వారు సాయంత్రం సమావేశం చేసినప్పుడు కలవవచ్చును అని సలహా ఇస్తే ఏకాంతరా అది మేము అనుభవిస్తాం రమ్మను అని ఎంతో అహంకారంతో చెప్పడం నాన్న తామసాన్ని సూచిస్తుంది. ఆ సాయంత్రం ఆయన ప్రసంగ కార్యక్రమం జరుగుతున్నప్పుడు దానికి ఎదురుగా ఒక చిన్న బల్ల వేసి వీరు చెప్పడం ప్రారంభించారు స్వామీజీ దగ్గర ఉన్న ప్రేక్షకులంతా ఇటు రావడం స్వామీజీకి ఆశ్చర్యం వేసింది. అది జరిగిన మూడు నెలలకు ఏర్పేడు మలయాళ స్వామి వారి దగ్గరినుంచి సుబ్బయ్య గారు వచ్చి నాన్నను ఏర్పేడు తీసుకువెళ్లారు. ఏర్పేడులో స్వామీజీని కలిసినప్పుడు మీకు చక్కటి కంఠం ఉంది. ఎంతసేపైనా మాట్లాడగలిగిన నేర్పు మీ సొంతం అయితే సరి అయిన పద్ధతిలో మాట్లాడడం కోసం మన సంస్కృతి సంప్రదాయాల మూలం భగవద్గీతను అధ్యయనం చేయండి ఒక వారం మీరు ఇక్కడ ఉండి ముగ్గురు ఉపాధ్యాయులు మూడు అధ్యాయాలను మీకు అర్థమయ్యేలా చెబుతారు అన్న వారి మాటను అంగీకరించి తరగతులకు హాజరవడం ఆయన జీవితంలో మొదటి ఓటమి. మొదటి రెండు రోజులు కర్మసిద్ధాంతం గురించి ఒకరు వచ్చి నాన్న కుర్చీలో కూర్చుంటే ఆయన నిలబడి చెప్పడం మూడో రోజు మరొకరు వచ్చి జ్ఞానాన్ని గురించి చెప్పడానికి ప్రారంభించగానే నీకు భగవద్గీత తెలిసినట్లుగా లేదురా అని లేచి వచ్చి స్వామీజీతో ఏరా నిన్న మొన్న చెప్పిన వాడికి ఇవాళ చెప్పిన వాడికి పొంతన లేదు. వీడికసలు భగవద్గీత వచ్చునా అని తిట్టి తిరిగి గ్రామానికి వచ్చారు. నెలరోజుల తర్వాత మళ్లీ సుబ్బయ్య గారు వచ్చి నీకు ఎలాంటి ఉపాధ్యాయులు ఉండరు స్వామీజీ మీకు ఒక గంటలో గీత మొత్తం చెప్తారు దయచేసి కాదనకుండా రండి పని దగ్గరుండి తీసుకు వెళ్లారు అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామిజీ ఏం బోధించారో ఎవరికీ తెలియదు నాన్న ఎప్పుడు ఆ ప్రస్తావన తీసుకురాలేదు. మూడవ రోజున కాషాయం ధరించి తన పేరుని సమత్వానందగా మార్చుకుని ఏక దీక్షగా 15 రోజులలో ఏర్పేడు ఆశ్రమంలోనే గీతా సిద్ధాంతము అన్న పేరుతో తన అభిప్రాయాలను వ్రాసి స్వామీజీకి చూపి వారి అభినందనలను పొందాడు. తర్వాత గీతా సందేశం అన్న పేరుతో ప్రతి శ్లోకానికి అర్థ తాత్పర్యాలతో కూడిన తన వ్యాఖ్యానాన్ని కూడా జోడించి రాశారు.
ఉత్తమ రైతు - శ్రీ కోటిరెడ్డి (10) - ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి