గీతా తత్త్వం (11);- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 స్వస్తి చిత్తే బుద్ధ యస్సం భవంతి అనునారియోక్తి వేదాంతరదే కదా. వేదాంతానుభవమును పొందుటకు స్వస్థచిత్తుడు కావాలన్నదే దీని అర్థం.  చిత్తమన్నను, మనసులను ఒకటే కదా. మనసు దేని వల్ల కలుగుచున్నది అను ప్రశ్నకు అన్నము యొక్క సూక్ష్మ అంశమే మనస్సు అని  తత్వజ్ఞునుల నిర్ణయము  (అన్నమయం హి సౌమ్యమనః) దీనిని బట్టి ఏది ఎందుండి కలిగినదో అది దాని ఆకారంతోనే నిలువ గలుగును అను న్యాయమను అనుసరించి మనసు నిరుచుటకు అన్నము అవసరమయ్యే స్పష్టపడుతున్నది కదా  అన్న మెచ్చటి నుంచి కలుగుచున్నది  జగత్తు నుంచి ఏ కదా జగత్తే మిధ్యా అయినచో అన్నము ఎక్కడ నుంచి లభించును. అన్నమే లభించనిచో చిత్తమెట్లు స్థిరత్వం పొందును ఎంత స్పష్టంగా కనిపించు ప్రత్యక్ష సత్యమును నిరాకరించి జగత్ మిత్య వాదములు  చేయువారు పశుతుల్యుడు గాక ప్రజ్ఞ వంతుడు ఎట్లగుదురు అని వీరు వాదించగలరు  ఇక వేదాంతుల వాదం ఇది.
భౌతిక వాదుల వాదములో సత్యమునచో  అన్నపానాదులు పుష్కల ముగానున్న శ్రీమంతుడు సుఖశాంతులను అనుభవించెదరు కదా  అట్లు జరుగుట లేదని మనకి అందరికీ అనుభవములో తెలిసిన విషయమే కాబట్టి  సుఖశాంతులకు భౌతిక సంపత్తి అనబడు అన్నపానాదులు ముఖ్యములు కావనీయు  ఆధ్యాత్మిక అనుభూతి ఒక్కటే  నిజమైన శాంతి మార్గమని వీరు వాదించెదరు  నిజమునకు ఈ రెండు వాదములలోను సత్యము లేకపోలేదు  భౌతిక సంపత్తి అనగా అన్నపానాదులు లేకుండా శోదేహములు నిలువవు  అలాగే వివేక జ్ఞానము లేకపోయినట్లయితే హృదయ శాంతి శూన్యం మగును కనుక పై రెండు సిద్ధాంతములను ఆచరణలో పెట్టగలిగినప్పుడే  మానవుని యొక్క సుఖశాంతులకు సంపూర్ణత చేకూర కలదు అని చరిత్ర  వేనోళ్ళ చాటుతున్నది  కానీ ఈ సమన్వయ మార్గమును  అనుసరించుటకు ఏ ఒక్కరు కూడా అంగీకరించారు  ఈ అనైక్యత వల్ల హిందూ సమాజమునకు కలిగిన నష్టము ఎంత అర్థాన్ని చెప్పనాలివి కాదు ఒక్క హిందూ సమాజమేఅననేలా  ఈ వ్యతిరేక సిద్ధాంతముల సంఘర్షణల వల్ల దేశ నాయకులు కూడా నామరూపములు లేకుండా నశించి పోయిన సంఘటనలు  చరిత్ర ఎన్నింటినో ఎత్తిచూపుతున్న విషయం మనందరికీ తెలుసు కదా.



కామెంట్‌లు