ఉత్తమ రైతు- శ్రీ కోటిరెడ్డి (24);-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322


 కే.వి సుబ్బారావు గారు వచ్చిన తర్వాత వారి విశేషాలు పని విలువలు కోసం వ్యవసాయదారుల కార్యక్రమానికి కూడా ఓబి  బ్రాడ్ కాస్ట్  ఏర్పాటు చేస్తే బాగుంటుందని సంచాలకులను కోరినప్పుడు  సహృదయంతో ఆయన అంగీకరించారు  ఆయన ఎప్పుడు గ్రామాలకు వెళ్లిన నన్ను ప్రక్కన తీసుకుని వెళ్లేవాడు  ఆ వెళ్లిన గ్రామంలో ఎవరు మంచి పెద్ద రైతులు ఉన్నారో  వారిని ఎన్నిక చేసి  వారిని వారి పొలం వద్దకు తీసుకువచ్చి  అక్కడ వారు అవలంబిస్తున్న పద్ధతులను  నేను ప్రశ్నలు వేసి  వారి సమాధానాల ద్వారా సేకరించి  తిరిగి వచ్చిన తర్వాత దానిని  రేడియో రూపకంగా తయారు చేసి  దానికి కావలసినహంగులను సమకూర్చి  ప్రసారానికి కావలసిన నిడివిని  దృష్టిలో పెట్టుకునే తయారు చేసి  దానిని ప్రసారం చేయడం వల్ల  మిగిలిన రైతులకు ఎంతో  ఉపయోగకరంగా  ఉండేది. సాహిత్య కార్యక్రమాలలో జరిగిన పద్ధతిని  ఇక్కడ కూడా అవలంబించి  మాట్లాడగలిగిన రైతులను ఎంపిక చేసి వారితో  ప్రత్యేకంగా ఒక్కొక్కరితో ఒక్కొక్క అంశాన్ని గురించి  కూలంకషంగా మాట్లాడించేవాడు. ఎవరైనా  అధికారంలో ఉన్న పెద్దవారిని పిలిచి  వారిని ప్రశ్నించడానికి కొంత మంది రైతులను ఎన్నుకొని  వారితో  వారికున్న అనుమానాలను బయట పెడుతూ వాటిని ఎలా  సవరించుకోవాలో చెప్పమన్నప్పుడు  ఆ అధికారి  అధికారికంగా చెప్పేవాడు  దానికి ప్రభుత్వ సహకారం కూడా ఎలా ఉంటుంది  వారి సాయాన్ని పొందటానికి రైతుగా మీరు ఏం చేయాలి  అన్న విషయాలను కూడా చాలా కూలంకషంగా తెలియజేసేవారు  ఇలాంటి కార్యక్రమాల వల్ల  అటు రైతులకు ప్రయోజనం కలగడమే కాకుండా  వ్యవసాయదారుల కార్యక్రమానికి కూడా విపరీతమైన శ్రోతల సంఖ్య పెరగడం  ఆ కార్యక్రమాన్ని వింటున్న శ్రోతలు దాని ప్రక్క అటు ఇటు వచ్చే కార్యక్రమాలను కూడా విని  ఆకాశవాణిని అభినందించడం  జరిగింది. సుబ్బారావు గారి తర్వాత హనుమంతరావు గారు వచ్చి  ఆకాశవాణిలో తెలుగు వార్తలు వచ్చినట్టుగానే  ఈ కార్యక్రమంలో వ్యవసాయదారుల వార్తలు అన్న శీర్షికన తాను  వ్రాసి  నాతో చదివించుకునేవారు  తాను చేసిన మరో కొత్త ప్రయోగం  వ్యవసాయానికి సంబంధించిన విషయాన్ని మాత్రమే స్వీకరించి  ఆ కథా వస్తువును నాటకీయతతో  రైతులకు అర్థమయ్యే భాషలో చెప్పగలిగిన  రచయితలని పిలిచి  రెండు మూడు దఫ్ఫాలుగా  ఏర్పాటు చేసి తన ఆశయాలు చెప్పి దానికి అనుగుణంగా  నాటకాలను రాస్తే  వాటిని ప్రచారం చేస్తాను  అని చెప్పి అనేకమంది రచయితలను ప్రోత్సహించారు. మాకు ఎక్కువగా సత్యనారాయణ రెడ్డి  అనేక రకాల పద్ధతులలో  రకరకాల నాటకాలను వ్రాసి ఇచ్చారు  దానిలో ఒక నాటకానికి కేంద్ర ప్రభుత్వం నుంచి  ప్రథమ బహుమతి కూడా వచ్చింది.


కామెంట్‌లు
Popular posts
చిత్రాలు ; ..జ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భారత్ నగర్ (మూసాపేట)- హైదరాబాద్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
చిత్రాలు ; జి.జీవనజ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భరత్ నగర్ హైదరాబాద్
చిత్రం
తెలివితేటలు!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం