నాటక ప్రతి తన వద్దకు వచ్చిన తర్వాత హనుమంతరావు గారు నన్ను పిలిచి ఈ నాటకాన్ని చేయి నటీనటుల ఎన్నిక నీ ఇష్టం. మన రైతు వారి పద్ధతిలో మాట్లాడే వాళ్ళని మాత్రమే ఎంచుకో అని జాగ్రత్తగా చెప్పి ఆ ప్రతినిచ్చేవాడు దానిలో ప్రతి అక్షరానికి జీవాన్ని పోసేవయ్యా అని అక్కడి నుంచి హనుమంతరావు గారు కొన్ని సందర్భాలలో బయట గ్రామాలకు వెళ్ళినప్పుడు వారు అంత క్రితం తయారయ్యి ఉన్ననాటకాలను రేడియోకి అనుగుణంగా మార్చుకుని ఆ నటులతోనే ఆ కార్యక్రమాన్ని అక్కడ రికార్డు చేసి వచ్చిన తరువాత దానిని ఎడిట్ చేసి ఎక్కడ ఎలాంటి సంగీతం దానికి సరిపోతుందో చూసి రేడియోకు తగిన నిడివిడితో వాట్లను కూడా ప్రసారం చేస్తూ ఉండేవాళ్లం దానితో వ్యవసాయదారుల కార్యక్రమానికి మంచి పేరు వచ్చింది. అలా ఓబుల్ రెడ్డి గారు నన్ను రైతులకు పరిచయం చేస్తూ ఉండేవారు రైతులకు అవసరమైన ప్రతి విషయాన్ని చాలా చక్కగా మా అందరికీ అర్థమయ్యే పద్ధతిలో చెప్పారు అని అభినందించారు కూడా. అప్పుడు కోటిరెడ్డి వేదిక పైకి వచ్చి మామయ్య గారు ఆకాశవాణి కార్యక్రమాల ద్వారా ప్రసారం చేయడమే కాకుండా వ్యక్తిగతంగా తాను కూడా వ్యవసాయ కార్యక్రమాలలో పాల్గొని దాని కష్టసుఖాలు తెలిసిన వారే చిన్నప్పటి నుంచి వారు పొలంలో చేసిన పనుల అనుభవం వల్ల రైతులను ఎలా ప్రశ్నించాలి వారి సమాధానాలను ఏ విధంగా మనం చెప్పించాలి అలా దానిలో నిష్ణాతులు అవ్వడానికి కారణం ఏదైనా పుస్తక పరిజ్ఞానం పరిపూర్ణమైనది కాదు అనుభవ జ్ఞానం లేకుండా ఏ రైతు కూడా ఏ పని సక్రమంగా చేయలేరు అన్నది స్పష్టం అని కోటిరెడ్డి కార్యక్రమాన్ని ముగించేవారు.
ఉత్తమ రైతు- శ్రీ కోటిరెడ్డి (25);- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి