"36 వ జాతీయవిజ్ఞానశాస్త్రదినోత్సవం-పద్యాంజలి"!!!;- "సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్-- చరవాణి :- 6300474467
01.

సీ.

జిజ్ఞాసపెంచెడివిజ్ఞానశాస్త్రమ్ము
పఠియించవలెనండిబాలలార
ఆసక్తికరమగునంశాలనెన్నెన్నొ
తెలుసుకోవలెనండితెలివిమీర
పరిశీలనముజేసినిరతమ్ముశోధనా
ఫలములుపొందండికలువలార
శాస్త్రవేత్తలకృషిశ్లాఘనీయంబని
మురియుచుతలవండిబుద్ధిదీర
(తే.గీ.)
ఆప్రయోగములన్నియునప్రయోజ
కములునైస్ఫూర్తినింపునుకాంక్షమీర
మనదుదేశకీర్తిపతాకమరువనీక
యెగురవేయగరారండియెల్లవేళ!!!


;-


కామెంట్‌లు