ఉత్తమ రైతు - శ్రీ కోటిరెడ్డి (4);- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఎవరీ ఉత్తమ రైతు ఎవరి రెడ్డి  వారి పుట్టుపూర్వోత్తరాలు  ఎక్కడ నుంచి ఎక్కడకు వెళ్లి ఎక్కడకు వచ్చారు  వివరాలన్నీ  తెలుసుకునే ముందు  రైతులు తమ అభిప్రాయాలను  తమ అనుభవపూర్వకంగా చెప్పినప్పుడు దానిని  ఆచరణలో పెట్టిన ప్రతి రైతు  ప్రగతిని సాధిస్తాడు  అని నమ్మినవారికి  అసలు వ్యవసాయంలో ఏమాత్రం పరిచయం లేకపోయినా  ఆ వ్యవసాయ క్షేత్రాన్ని  సుభిక్షం చేయాలన్న అభిప్రాయంతో  దీక్షగా అధ్యయనం చేసిన వారు తప్పకుండా  కృత కృత్యులవుతారు  అన్న నిజం ఈ రెడ్డి గారి జీవితం  రుజువు చేసింది అని చెప్పడం కోసం  వారు చెప్పిన విషయాలను  గమనించి ప్రతి రైతు ముందుకు సాగాలని చెప్పడం తప్ప వేరే అభిప్రాయం లేదని మనవి చేస్తూ ముందుకు వెళుతున్నాను. అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం  దేశ ప్రజల క్షేమం కోసం  అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు  ప్రత్యేకించి సంక్షేమ కార్యక్రమాలు అన్న పేరుతో  వ్యవసాయ  అభివృద్ధితో రైతులకు ఆర్థిక వనరులను పెంచడం కోసం  కొత్త కొత్త పద్ధతులను తీసుకొస్తున్నారు  గ్రామాలను కూడా పునర్ నిర్మించడం కోసం  ఎంతో కృషి చేస్తున్నారు  కానీ ఈ నాటికీ  అనేక గ్రామాలలో  ఏ మాత్రం ప్రగతి కనిపించడం లేదు అన్నది నగ్న సత్యం  చాలా గ్రామాలలో  ఎడ్లబండితో  ప్రయాణం చేయడం  పల్లెల్లో అలవాటు  వేరే ప్రాంతం నుంచి వచ్చిన బంధువులను  తమ గ్రామానికి తీసుకు రావడం వేరే గ్రామానికి వెళ్లే ఆడపడుచులను పంపడానికి ఎడ్ల బండ్లు తప్ప  వేరే సాధనాలు లేవు  సైకిల్ మీద వెళ్లే  వనరులు కూడా చాలా గ్రామాలలో  ఏర్పడలేదు.
పొలాల గట్ల నుంచి  వెళ్లడం  రావడం  ఆ పరిసర గ్రామాలకు  వెళ్ళడానికి ఒక పూట పని  అదే వర్షాకాలం అయితే  జారుకుంటూ ఎంతో జాగ్రత్తగా నడపవలసి ఉంటుంది  అరగంట  లో వెళ్ళగలిగిన దూరాన్ని దాదాపు గంటన్నరకు  వెళితే అతను చాలా వేగంగా వెళ్ళినట్లు లెక్క  గ్రామ పంచాయతీలు  రోడ్లు వేసుకునే స్తోమతలో లేవు  ఎంతమంది ధనవంతుడులున్నా ఆ విషయాలను గురించి పట్టించుకునేవారు లేరు  ఎవరికి వారు ఇది తమ పని కాదులే అనుకుంటూ  నిత్యం వారు చేసే కార్యకలాపాలలో మునిగిపోతూ ఉంటారు  సహజంగా చాలా గ్రామాలలో జరిగే  పరిస్థితి ఇదే. మగవారి కన్నా ఆడవారు  ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రత్యేకించి వర్షాకాలం వచ్చినప్పుడు  నడక సాగదు.

కామెంట్‌లు