బాలగేయం;- సత్యవాణి కుంటముక్కుల-8639660566
ఆడవే ఆడవే అమ్మణ్ణి
ఆడవే పాడవే
అమ్మణ్ణి
జడలకు రిబ్బన్ కట్టుకొని
నుదుటను తిలకం పెట్టుకొని
కళ్ళకు కాటుక పెట్టుకొని
ఆడవే ఆడవే అమ్మణ్ణి
ఆడవే పాడవే అమ్మణ్ణి
చెవులకు రింగులు పెట్టుకొని
మెడలో గొలుసులు వేసుకొని
ఆడవే ఆడవే అమ్మణ్ణి
ఆడవేపాడవే అమ్మణ్ణి
పువ్వుల గౌనును 
వేసుకొని
మువ్వల గజ్జలు పెట్టుకొని
నవ్వులు కలకల నవ్వుతును
ఆడవే ఆడవే అమ్మణ్ణి
ఆడవే పాడవే అమ్మణ్ణి

    

కామెంట్‌లు