భూకంపం ముత్యాల హారాలు;- గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.-సెల్.9491387977.నాగర్ కర్నూల్ జిల్లా.
భూమికి జ్వరం వచ్చింది
దాని కాయం మండింది
నెర్రల్లో సెగ రగిలింది
గుండె కూడా పగిలింది  !

మానవునికి వచ్చినట్లే
భూమికి పెక్కు ఇక్కట్లే
భవంతుల కూల్చేస్తుంది
మానవుల ముంచేస్తుంది!

సెగలు పొగలు కక్కుతుంది
లావాను విడిచేస్తుంది
భుజంగంలా కరుస్తుంది
పెద్దపులిలా అరుస్తుంది !

కోపం తాపంతో తను
కోడెనాగై పారేను
ఇక విషం తాను చిమ్మేను
సర్వస్వం కబళించేను !

భూమికి  వచ్చేను కష్టాలు
మనకు మిగిలేను నష్టాలు
భూమాతకు పరితాపం 
మరి మనకేమో పాపం  !

గిరులను పేల్చి వేయును
తరులను కూల్చి వేయును
వొనరులన్నీ చేజారును
బతుకంతా దిగజారును !

ఇందుకు టర్కీ ఉదాంతం
చూస్తే మనకు నిర్గాంతం
తప్పక కలుగును వినుమా
నీవే నిజమును కనుమా !


కామెంట్‌లు