ప్రతి వ్యక్తి ఒక లక్ష్యంతో మనుగడ సాగించాలి. లక్ష్యాన్ని చేరుకోవడానికి స్వీయక్రశిక్షణ కావాలి. దానికి సాధన చాలా అవసరం. క్రమశిక్షణతో కూడిన సాధన చేయాలనే సంకల్పం కూడా ఒక సాహసోపేతమైన నిర్ణయమే. సాధన అంటే పునరావృతం అనుకుంటారు. కాని సాధన ఎల్లప్పుడు విభిన్నం. ఎందుకంటే సాధన ద్వారా తలపెట్టిన లక్ష్యానికి దగ్గరవుతూ ఉంటాము. “అనగననగ రాగమతిశయిల్లు”నట్లు సాధన చేస్తూ ఉంటే లక్ష్యాన్ని చేరుకోవచ్చు. అయితే చిన్నదైనా, పెద్దదైనా లక్ష్యాన్ని గౌరవించాలి. దానికి పసిపిల్లవాడిని ఉదాహరణగా తీసుకుందాం. నెలల పసివాడు ఏ గురువు లేకుండగానే, ఎంతో సాధన చేసి బోర్లపడతాడు. అంతే సాధనతో పారాడుతాడు. మోకాళ్లు నొప్పిపుట్టినా లక్ష్యసాధనలో వెనుతిరగకుండా తన కాళ్ల మీద నిలబడతాడు. కష్టాలను, ప్రమాదాలను ఎదుర్కోకుండా ఎవరూ తమ లక్ష్యాన్ని చేరుకోలేరు.
సాధన అంటే సమయం వృధాచేసుకోవడం కాదు. వర్షపునీటిని గమనిస్తే అది అర్థమవుతుంది. వర్షపునీరు ఎదురువచ్చే రాళ్లురప్పలను. ఎత్తుపల్లాలను, వంకలను దాటుతూ నదిలో కలుస్తుంది. తరువాత నెమ్మదిగా ప్రవాహంలా సాగుతూ, ఒక్కోసారి సన్నని ధారగా, మరోసారి నిండుగా సాగుతూ తన గమ్యస్థానమైన సముద్రాన్ని చేరుతుంది. ఎవరైనా నెమ్మదిగా క్రమశిక్షణతో సాధన చేస్తే గమ్యాన్ని, లక్ష్యాన్ని చేరుకోవచ్చు.
ఒకవేళ సాధన చేసినా ఒక్కోసారి లక్ష్యాన్ని చేరుకోవటంలో విఫలమవ్వచ్చు. అవరోధాలనే అవకాశాలుగా మార్చుకోవాలి. ఎదుటివారు విసిరినరాయిని లేదా విమర్శలను ఆయుధాలుగా మలచుకోవాలి. దిశను మార్చుకొని ముందుకు సాగాలి. సాధనలో పాత్రానీదే, యత్రానీదే. సహనంతో కష్టపడడం, ఎదుటివారిని గౌరవించడం. ఎవరినీ నిందించకుండా ఉండడం అనే లక్షణాలను లక్ష్యసాధనలో సాధనాలుగా చేసుకోవాలి.
ఎంతో కష్టపడి చదునుచేసి, విత్తునునాటే రైతు, సహనంతో మొలకల కోసం ఎదురుచూస్తాడు. ఆ మొలకలను చూసి చిన్నపిల్లవాడిలాగా ఆనందిస్తాడు. ఋతువులను గౌరవిస్తూ, ఆయా కాలాలకు తగిన పంటనే వేస్తాడు. ఒకవేళ ప్రకృతి వైపరీత్యాలతో పంటకు నష్టం కలిగినా,మరల పంట వేయడానికి సిద్ధపడతాడు. నిరాశపడకుండా లక్ష్యసాధన అనేది ప్రతివిషయంలోనూ చాలా ముఖ్యం. దానిని సాధించే క్రమంలో బాల్యాన్ని మరువకూడదు. మనిషి తనలోని పసితనంతో అనుబంధాన్ని పెంచుకోవాలి. అంటే సృజనాత్మకంగా, ఉత్సాహంగా, ఏకాగ్రతతో సాధనచేయడమన్నమాట.
“కదురాడిన ఇంట్ల, కవ్వమాడిన ఇంట్ల కరువుండదు” . పనిని రేపటికి వాయిదా వేయవచ్చు. కాని కాలాన్ని రేపటికి వాయిదా వేయలేము. చాలా విలువైనది కాలం. కరిగిన కాలాన్ని ఏ ఉపాయంతో నైనా తిరిగి పొందలేము.ఒక మనిషి ఉన్నట్లు మరొక మనిషి ఉండడు. ఒక మొక్క ఉన్నట్లు మరొక మొక్క ఉండదు. అలాగే సాధన కూడా! శిశిరం తర్వాత వసంతం తప్పక వస్తుంది. అడ్డంకులు, పొరపాట్లు, బాధ, కష్టాలు మొదలైనవి అసలైన విజయానికి సోపానాలుగా భావించాలి.
ప్రతిపని అవహేళన, వ్యతిరేకత, ఆమోదం అనే మూడుదశలను దాటాలి. ఒకవేళ సాధనలో అపజయాలు ఎదురైనా, వాటిని లక్ష్యపెట్టకూడదు. అపజయాలు ఒక్కోసారి జీవితానికి పునాదిగా ఉపయోగపడతాయి. అపజయాలను జీవనప్రయాణంలో మజిలీలుగా చూడాలి. అపజయాలతో నిరుత్సాహపడకుండా లక్ష్యసిద్ధికై ముందుకు సాగాలి. దీనికి సూర్యచంద్రులనే మనం స్ఫూర్తిగా తీసుకుందాం.
చీకటిని అధిగమించి వెలుగుపూలు చల్లేవాడు సూర్యుడైతే, అమావాస్యని అపహసించి వెన్నెల కుప్పలతో ఆడేవాడు చంద్రుడైతే, ఆ వెలుగుపూలలోంచి, ఆ వెన్నెల కుప్పలలోంచి నడుచుకుంటూ లక్ష్యాన్ని చేరేవాడు సాధకుడు. ప్రతిదీ మనకు వ్యతిరేకంగా జరుగుతుంటే గాలికి అభిముఖంగా లేచే విమానాన్ని చూసి లక్ష్యాన్ని చేరడానికి మళ్లీ కొత్తగా ప్రయత్నాన్ని మొదలుపెట్టాలి.
సాధన ద్వారా నైపుణ్యాలను పొందవచ్చు. ప్రపంచానికి ఆ నైపుణ్యాలతో సేవలను అందించవచ్చు. సాధనలో ఒక భాగమే పరిశోధన. కొత్త కొత్త ఆవిష్కరణలకు పరిశోధనలు చాలా ముఖ్యం. వైద్యశాస్త్రంలోని పరిశోధనల ఫలితమే, ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వాక్సిన్ ఆవిష్కరణ. అంటే అనుకోని విపత్తులు ఎదురైనప్పుడు దాని నుండి మానవాళిని రక్షించానికి నైపుణ్యాలు చాలా అవసరం. దానికి కూడా ఏకైక మార్గం సాధనే.
“సమస్య లొస్తే రానీ
సవాళ్లు ఎదురైతే అవ్వనీ
ఓటమి తలుపు తడితే తట్టనీ
నిలుద్దాం, పోరాడదాం, గెలుద్దాం”
___ స్వామి వివేకానంద
********************************************************

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి