కష్టసుఖాలు! అచ్యుతుని రాజ్యశ్రీ

 శివా సామాన్య రైతు. పంటలు బాగా పండటంతో దానధర్మాలు చేసేవాడు.ఆఊరి స్వామీజీ దగ్గరకు వెళ్లి "నాకు పంట బాగా పండింది కనుక మీ ఆశ్రమానికి విరాళం ఇస్తాను"అన్నాడు."నాయనా! నాకు ఎంతో మంది ఇస్తున్నారు. ఈడబ్బుదాచుకో.ఎప్పుడు ఏఅవసరం వస్తుందో ఎవరికీ తెలీదు కదా?" ఆయన మాటలకి నిరాశ చెందాడు.ఈసారి వర్షాలతో పైరు దెబ్బతింది."స్వామీ! పంట చేతికి అందలేదు. "బాధగా అన్నాడు. "అప్పుడు సంతోషంగా డబ్బు ఇవ్వాలి అనుకున్నావు.ఆడబ్బు ఉంది కదా? అవసరానికి అందుకుంటుంది కదా? కష్టసుఖాలకి కుంగి పొంగిపోరాదు." అని ఓదార్చాడు. పిల్లలు కూడా మార్కులు తక్కువ వస్తే బాధ పడరాదు.లాజిక్ గా తర్కించుకుంటూ భవిష్యత్తులో ఇంటర్వ్యూ లు ఎదుర్కోవడానికి సబ్జెక్టు అంతా క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి 🌷
కామెంట్‌లు