అనగనగా ఓ గ్రామం. ఆ గ్రామంలో ఓ మేధావి. పేరు మాధవాచార్య. ఆర్థిక రంగానికి సంబంధించిన మేధావి.
వివిధ దేశాల రాజులు తమ దేశ ఆర్థిక పరిస్థితులను చక్కబెట్టడానికి మాధవాచార్యను సంప్రదిస్తుం డేవారు.
ఓరోజు ఊరి పెద్ద ఆయన వద్దకు వచ్చి హేళన చేశారు.
"అయ్యా. మీరు గొప్ప మేధావి అని అందరూ చెప్పుకుంటున్నారు. కానీ మీ అబ్బాయేమో వొట్టి బడుద్ధాయి. ఏమీ రాదు. బంగారం, వెండి ...ఈ రెండింట్లో ఏది విలువైనదో చెప్పమంటే వెండి అంటున్నాడు. సిగ్గుచేటుకదండీ" అన్నాడు ఊరి పెద్ద.
మేధావి మాధవాచార్య ఆ మాటలకెంతో బాధపడ్డాడు.
కొడుకుని పిలిచాడు.
"బంగారం, వెండి...వీటిలో ఏది ఎక్కువ విలువైనది" అని అడిగారు.
"బంగారం" అన్నాడు కొడుకు.
అప్పుడాయన "మరెందుకు ఊరి పెద్ద అడిగితే వెండి విలువైనదని చెప్పావటగా. ఎందుకలా?" అని అడిగారు.
కొడుకు "రోజూ నేను స్కూలుకి పోతున్నప్పుడు ఆయన ఒక చేతిలో బంగారు నాణెం, మరొక చేతిలో వెండి నాణెం ఉంచుకొని నన్ను పిలిచి మేధావి పుత్రుడా...ఈ రెండు నాణాలలో ఏది విలువైనదో తీసుకోరా" అని అనేవారు.
"నేను వెంటనే వెండి నాణాన్ని తీసుకునేవాడిని.
వెంటనే ఆయన తన పక్కనున్న వారితో నా గురించి చులకనగా ఓ నాలుగు మాటలని నవ్వుతారు. నేనేమీ పట్టించుకోకుండా ఆ వెండి నాణెంతో వెళ్ళిపోతుండేవాడిని. ఇలా ఓ ఏడాదిగా జరుగుతోంది. రోజూ నాకో వెండి నాణెం లభిస్తోంది. నేను బంగారం అని చెప్పి ఆ నాణెం తీసుకుని ఉంటే ఆ రోజుతోనే ఈ ఆట ఆగిపోయేది. నాకు నాణాలూ లభించేవి కావు. కనుక ..." అని ఇంకా ఏదో అంటుంటే తండ్రి మాధవాచార్య విస్తుపోయారు.
నీతి : జీవితంలో అనేక సమయాలలో మనం మూర్ఖులుగా వేషం వేసుకుంటాం, ఇతరులు అది చూసి ఆనందించడానికి! నిజానికి మనం ఓడిపోవడం లేదు. వాళ్ళేమో మనమీద గెలిచామనుకుంటారు. కానీ మరో కోణంలో చూస్తే మనం గెలిచినట్లే అవుతుంది. ఏ కోణం ముఖ్యమైనదో మనమే తీర్మానించుకోవాలి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి