బొట్టు పెట్టుకోవడం హిందువుల్లో అన్ని కులాల వారికి ఏదో ఒక మత చిహ్నాన్ని నోసట ధరించడం సంప్రదాయం. కనుబొమ్మల మధ్యగా కుంకుమ, విభూతి, గంధం, తిలకం మొదలైనవి పెట్టుకోవడం-అక్కడి ఆజ్ఞ చక్రాన్ని పూజించడమే నని పెద్దల మాట!. ప్రపంచంలో ఏ దేశాల్లో అయినా బొట్టు పెట్టుకున్న స్త్రీ భారత స్త్రీ గానే సాక్షాత్కరిస్తుంది. శుభకార్యానికి నాందిగా బొట్టు పెట్టి పిలవడం మన సంప్రదాయం. స్త్రీ నుదుటి బొట్టు ఆమె ఐదవతనం కలిగి ఉందని గుర్తించడానికి ఒక గుర్తు. మన సంప్రదాయంలో ఏమున్నా లేకున్నా బొట్టు పెట్టి సాగనంపుతారు. ఉన్నవాళ్లు, లేని వాళ్ళు ధరించేది బొట్టు. బొట్టు సౌందర్యాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావించి, మన భారతీయులు గడపలకు బొట్లు పెట్టి, అలంకరించి, అందాన్ని ఆహ్వానిస్తారు. బొట్టు స్త్రీ సౌందర్యానికి చిహ్నమే కాకుండా-ఇతరుల దిష్టి సోకకుండా నివారిస్తుందని మన పెద్దల నమ్మకం. ఉయ్యాలోని పసి బిడ్డ మొదలు వృద్ధాప్యం వరకు ప్రతి స్త్రీ బొట్టు ధరిస్తూనే ఉంటుంది.
కుంకుమ ఎర్రగా ఉంటుంది. మన జీవనజ్యోతిని నడిపించే రక్తం కూడా ఎర్రగానే ఉంటుంది. ఆ రంగు సూర్య శక్తిని ప్రతిబింబిస్తుంది. సూర్య శక్తిని తనలో లీనం చేసుకొని, సూరిని వేడిమిని తాకనివ్వదు. కుంకుమ నుదుటే ధరిస్తాము. శాస్త్రీయంగా చూస్తే మన శరీరంలోని అన్ని నాడులను (72 వేల నాడులను) కలుపుతూ, మెదడుకు సంకేత స్థానంగా నిలిచి, ఎప్పుడు మేల్కొనే ఉంటూ, అత్యంత కీలకమైన'సుషుమ్న'నాడీ కనుబొమ్మల మధ్యలో ఉంటుంది. తానే మన పూర్వులు జ్ఞాననేత్రం అన్నారు. ఈ శక్తివంతమైన జ్ఞాన నేత్రానికి పగవారి దృష్టి పడకుండా, సూర్యతాపం తగలకుండా-రక్త ప్రసరణ ద్వారా ఆలోచన పరంపరల ద్వారా వేడి జనించి-ఆ వేలిలో జ్ఞాన నేత్రం కరిగిపోకుండా-ఎప్పుడూ ఆ ప్రదేశాన్ని చల్లగా ఉంచడానికి-అక్కడే ఎప్పుడు కుంకుమ ధరించాలి. ఇది బొట్టు యొక్క ప్రాధాన్యత.
ఆచారాలూ-శాస్త్రీయత..;- తాటి కోల పద్మావతి గుంటూరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి