ఎవరెందుకు పుడతారో...,
ఎవరికి తెలుసు !?
పుట్టి...సుఖ,భోగాలనుభవిం చేది కొందరు... !
దుఃఖ బాధల్నిభరిస్తూ...బ్రతికే వారింకొందరు... !!
చరిత్రకారులెవరౌతారో...చరిత్ర
హీనులుగా...,ఎవరుతయారౌ
తారో... !
ఎవరు,ఏమౌతారో...అగమ్య
గోచరం ! ఊహాతీతం... !!
ఉన్నత శిఖరాలనధిరోహించి...
పేరు, ప్రఖ్యాతులు పొందేవా రెవరో...,
నీచ కార్యాలతో నేరస్తులై...
శిక్షల ననుభవించేవారెవరో !!
"ఎవరి కర్మ కెవరు కర్తలు " అనే ది మా బామ్మ... !
చేసుకున్నవారికిచేసుకున్నంత
మహాదేవ అంటుండేవాడు మా తాత.. !!
"వీళ్లది అర్ధం - పర్ధం లేని కర్మ సిద్ధాంతం!వీళ్లంతా సెంటిమెంట ల్ ఫూల్స్... !"
అనేవాడు... మా వీధి చివరి హేతువాది !!
ఆమాటలేవీఅప్పట్లోనాకుబోధ
బోధపడేవి కావు .... !
గానీ,ఇప్పుడాలోచిస్తుంటే...,
నాకైతే...ఆ యా మాటలకు ఖచ్చితమైన అవగాహన కలి గింది... !
హేతువాదమంటే,ఖచ్చితమైన
కార్య,కారణ సంబంధాలే కదా!
జరుగుతున్నకార్యానికి...కార ణమేదోఉండే ఉంటుందిఅనేగా
ఆ కారణాన్ని ఇంకెవరిమీదికో నెట్టేయటం అన్యాయం కదూ!
కర్మసిద్ధాంతమంటే...,నా కర్మ అనుకునిచేతులుకట్టుకుకూచో
మనా... !? కాదుకదా !
మనంచేసుకున్నపాపపుణ్యాలే
మన మనుభవిస్తున్నకష్ట,సుఖా
లు, అనే సత్యాన్ని గ్రహించి...,
అవి అనుభవించక తప్పదని
ఇట్టి కష్టాలికముందుఅనుభవిం చకుండా...ఇప్పుడు,చెడుజోలికిపోక మంచిపనులు మాత్రమే చేసి... భవిష్యత్తులో...
కష్ట,బాధలనుండి తప్పుకునే గట్టి ప్రయత్నాన్ని బోధించేదేనో య్ కర్మసిద్ధాంత మంటే.... !
ఇంతకన్నా... కార్య, కారణ
సంబంధ హేతువాదమింకేముం టుంది...!?
జన్మకు అర్ధాన్ని, పరమార్ధాన్ని
ఈ ప్రపంచానికి తెలియజెప్పిన జగద్గురువు మన భారత జనని... !జయహో భారత్ !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి