చెంప దెబ్బ ఆట;-- యామిజాల జగదీశ్
 తెలివైన నిర్ణయాలను అంత వేగంగా ఎలా తీసుకోవాలి? అదెలాగో బీర్బల్ కథలోకొద్దాం. ....
అక్బరుకి బీర్బల్ అంటే ఓ మర్యాద. గౌరవం. అయినప్పటికీ అతనిలోనూ ఓ అసూయ లేకపోలేదు. అక్బర్ రాజు కావచ్చు. కానీ అతనూ ఓ మనిషేగా. 
బీర్బల్ అందరికన్నా తెలివైన వాడిగా ఎలా  ఉంటున్నాడు....అందరితోనూ ఔరా అన్పించుకుంటున్న బీర్బలుని ఒక్కసారైనా కించపరచాల్సిందే....లాభం లేదు...ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచనలో పడ్డాడు అక్బర్. 
"నేను రాజుని. కనుక ఆ అధికారంతో నలుగురిలోనూ ఓ దెబ్బ తీయాలి" అనుకున్నాడు అక్బర్. అందుకేం చేయాలా అని ఆలోచించాడు. ఓ నిర్ణయానికొచ్చాడు.
ఎప్పట్లాగే సభ సమావేశమైంది. బీర్బలుని పిలిచాడు. ఏమీ మాట్లాడకుండా అందరి సమక్షంలో బీర్బల్ చెంప ఛెల్లుమన్పించాడు అక్బర్. 
రాజుగారి ఊహాతీత చర్యకు అందరూ కంగుతిన్నారు. బీర్బల్ అంత పెద్ద తప్పు ఏం చేశాడాని అందరూ ఆలోచిస్తున్నారు. చెవులు కొరుక్కుంటున్నారు. కానీ ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. 
బీర్బల్ ఏం చేసుంటాడాని?
అక్బర్ తనను కొట్టినందుకు ఒక్క క్షణం ఆలోచించిన బీర్బల్ మరుక్షణమే తన పక్కనున్న మంత్రి చెంపమీద గట్టిగా కొట్టాడు.
మంత్రి నిశ్చేష్టుడయ్యాడు. చురచురా చూశాడు.
అంతట బీర్బల్  "ఏమిటలా చూస్తున్నారు? ఇంకెందుకాలస్యం? వెంటనే మీరు మీ పక్కనున్న మరొకరి చెంపమీద ఓ దెబ్బేయండి. ఆయన ఇంకొకరిని కొడతాడు. ఇలా అందరూ కొట్టుకుంటూ పోవాలి.
మన రాజుగారు ఈరోజు మొదలుపెట్టిన ఆటలో భాగమే ఇది" అని చెప్పాడు. 
వెంటనే ఆ మంత్రి తన పక్కనున్న మంత్రిని కొట్టాడు. సభలో ఇలా ఒకరిని ఇంకొకరు కొట్టడం ఆ ఒకరు మరొకరిని కొట్టడం...ఇలా కొడుతున్న ఈ విషయం కోట దాటింది.  ఇంకేముంది...దేశంలోనూ ఇదేదో ఆట అనుకుని ఒకర్నొకరు చెంపదెబ్బ వేసుకుంటున్నారు.
చివరికి ఈ ఆట రాణి, చెలికత్తెల వరకూ వచ్చింది. ఒకర్నొకరు కొట్టుకుంటూ వచ్చారు. ఓ చెలికత్తె రాణి చెంపమీద ఓ దెబ్బ వేసింది. 
రాణి కంగుతింది. ఏమిటిది అని అడగ్గా చెలికత్తెలు " ఇది ఈరోజు రాజు ఆరంభించిన ఆట" అంటూ "మీరీ దెబ్బల ఆటను రాజుగారితోనే ముగించండి" అని నవ్వారు.
రాత్రి రాజు రాణిని చూడటం కోసం అంతఃపురంలోకి అడుగుపెట్టాడు. అంతే, వెంటనే ఆమె భర్త అని చూడకుండా అక్బర్ చెంప మీద ఓ దెబ్బేసింది.
రాజుకి ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తాడు. 
అప్పుడు రాణి ..."ఏమిటలా చూస్తున్నారు...మీరీ రోజు ఉదయం బీర్బలుతో మొదలుపెట్టిన ఆటండీ ఇది. అందులో భాగంగానే నేను మిమ్మల్ని కొట్టానండి. అంతేనండి. ఇదొక ఆటగా అందరూ చెప్పుకుంటున్నారు. నన్నూ ఓ చెలికత్తె కొట్టింది. మీలాగే తెల్లమొహం వేస్తే చెలికత్తెలందరూ కలిసి ఈ ఆట విషయం చెప్పారు" అంది.
ఇదీ సమయోచిత తెలివితేటలంటే....
మనం ఏది నాటుతామో అదే మనకు లభిస్తుంది అనడానికి ఇదొక ఉదాహరణ.

కామెంట్‌లు
Popular posts
చిత్రాలు ; ..జ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భారత్ నగర్ (మూసాపేట)- హైదరాబాద్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
చిత్రాలు ; జి.జీవనజ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భరత్ నగర్ హైదరాబాద్
చిత్రం
తెలివితేటలు!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం