ప్రభాత వేళను ప్రభవించే
ప్రభాకర బింబ దర్శనం కోసం
పరితపిస్తూ.పరిమళాలు
దోసిట నింపి నిరీక్షిస్తూ
స్వాగతించాలని చేతులు జోడించి
ప్రసూన శ్రేణి ఎదురుచూపు
చిన్ని జీవితమను చింతలేదు
ఎవరో చూడాలని కోరిక లేదు
ఎందుకు ఎవరికోసం
విరియాలని ప్రశ్న లు లేవు..
పొద్దెక్కేసరికి విరగబూసి
పొద్దువాలేటప్పటికి
వసి వాడిపోయే
పసి జన్మలు
నేల ఒడిలో తీగపై జన నం
గాలి పల్లకిలో పరిమళపు
పయనం
ఆనందమే జీవిత గమనం
జగమంతా కుటుంబమే
ఆనందమంతా తనదే!
అందాలన్నీ అందరికీ
కనువిందే!
కోసినా కిమ్మనదు
సిగలలోనో....
పరమాత్ముని పాదాల చెంతో
పరమానందంగా
పరవశించి ధన్యమవుతుంది
కలతలు లేవు కన్నీళ్ళు లేవు
కమ్మగ విరిసి మురిసే కలలాటి
జన్మ....
మౌనమైన ఆరాధన
మూగవీణావాదన
రసరమ్య రాగాలాపనతో
సురుచిర సుందర
శుభోదయ స్వాగతాకాంక్షల
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి