శబ్ద సంస్కృతి!అచ్యుతుని రాజ్యశ్రీ
 
ప్రాచీన భారత్ లోదుస్తుల పేర్లు ఇలా ఉండేవి. అధోవస్త్రం (ధోవతి) శాటిక(చీర)అంగరక్షక( అంగరఖా) అంగప్రోక్షక్(అంగోఛా).
ముస్లింల పాలనలో కుర్తా పాజామా షేర్వానీ బుర్కా  ధరించే దుస్తులు. 
ఆంగ్లేయపాలనలో కోటు ప్యాంటు సూట్ బుష్షర్ట్ ఫ్రాక్ పెట్టికోట్ నైటీ బ్లౌజ్ స్కర్ట్ మినీస్కర్ట్ బెల్ బాటమ్ లూజర్ స్వెట్టర్  ఆపై టై సాక్సు గ్లౌస్ వచ్చాయి.ఆర్యులు వసంత కాలంప్రారంభంనించీ హోలీదాకా ఎన్నో ఉత్సవాలు జరుపుకునేవారు.వీటిని మదనోత్సవాలు అనేవారు.ఇక ఎస్కిమోభాషలో బర్ఫ్ అంటే మంచుకి దాదాపు వంద పదాలున్నాయి. మంచులో ఎన్నో రూపాలు వారు చూస్తారు కాబట్టి  కొత్త కొత్త పదాలు వచ్చాయి.హిందీ లో హిమం తుషారం తుహినం అంటారు. ఇక అరబిక్ భాషలో ఒంటెకి బోలెడన్ని పర్యాయపదాలున్నాయి.ఒంటెని గౌరవిస్తారు.
హిందీ లో జూహీ చమేలీ అనే రెండు రకాల పూలున్నాయి.ఆంగ్లంలో కేవలం జాస్మిన్ ఒక్కటే పువ్వు ఉంది. ఇదే ఉర్దూలో యాస్మిన్ ఐంది. తెలుగు లో జాజి విరజాజి మల్లె కాగడామల్లె బొండు మల్లె దొంతరమల్లె ఎన్నెన్నో!
ఆర్యులు సోమరసం తాగేవారు.ఇది సంస్కృతపదం.యావక్(జొన్నలతో)వంటకాలు మంథ్ అంటే నానేసిన బియ్యం తో చేసినవి తినేవారు. ఫారశీ టర్కీ వాసుల 
హల్వా కోర్మా పులావ్ కబాబ్ సమోసాలు ఇప్పుడు తింటున్నారు. ఆంగ్లేయుల శాండ్విచ్ టోస్ట్ ఐస్క్రీం ఆమ్లెట్ సూప్ నేడు ఆధునిక తిండి! విస్కీ బ్రాందీ రమ్ మత్తు పానీయాలు నేడు చిత్తుచేస్తున్నాయి.
మనదేశంలో బెల్లంకి ప్రాధాన్యత ఇస్తాము. బెల్లం దేవునికి నైవేద్యం పెడతాము.చక్కెర కన్నా బెల్లం శ్రేయస్కరం.  గుడధానీ గుడభేలీ గుడంబా బెల్లం తో తయారు చేసేవి.ఇంగ్లాండ్ లో తేనె హనీ వాడ్తారు.అందుకే హనీమూన్ హనీ ఇన్ ది మౌత్ సేవ్ ది పర్స్ అనే మాటలు వాడుకలో వచ్చాయి. 
ఇకవివిధ భాషల్లో పదాలు వాటి అర్ధాలు విచిత్రంగా అనిపిస్తాయి.ఆంగ్లంలో ఇంటరెస్ట్ అంటే ఆసక్తి  వడ్డీ అని అర్థం. కానీ ముస్లిం దేశాల్లో వడ్డీ తీసుకోవడం పాపంగా భావించారు. సూద్ ఖోర్ అనే పదం వాడుతారు. తమ తిరస్కారాన్ని సూచిస్తుంది ఆపదం!
అలాగే రొట్టెలు  తయారు చేసేవారిని మహారాజ్ పండిత్ అని హిందీ లో కొన్ని ప్రాంతాలలో అంటారు. మనకి అది వింటే ఆశ్చర్యంగా అన్పిస్తుంది కదూ?
మున్షీ అంటే గుమాస్తా క్లర్క్ అని అర్థం. కానీ మహారాష్ట్ర లో పోలీస్ ని మున్షీ అంటారు. 
మున్షీ ప్రేంచంద్ ప్రసిద్ధ హిందీ సాహితీవేత్త!

కామెంట్‌లు