సనాతన ధర్మం ఆచార వ్యవహారాల ద్వారా తన వైభవాన్ని నిరంతరం ప్రకటిస్తూ ఉంది. ఆచార వ్యవహారాలతో ముడిపడిన సంప్రదాయ కళలు. మన ఇంటి ముందు ముగ్గులు వేస్తుంటాం.
మనం ఇంటి ముందు పేడ నీళ్లతో కలాపి చల్లి ముగ్గులు పెడతాం. ఒకవైపు ఆచారం. ఎందుకంటే పండుగ పప్పాలో తప్పకుండా ముగ్గు పెడతాం. తద్దినం రోజున మాత్రం ముగ్గు పెట్టకూడదు. ముగ్గులు వేయడం ఒక కళ. ఇలాంటి దాన్నే సంప్రదాయ కళ అని పిలుస్తాం. కొందరు చిత్రలిపి అని కూడా పేర్కొన్నారు. అలాంటి కళల్ని పరిచయం చేసుకుందాం.
ముగ్గులు ఎన్నో రకాలు ఉన్నాయి. ఒక్కొక్క సందర్భంలో ఒక్కో విధమైన ఆకారం కలిగిన ముగ్గులు వేస్తుంటాం. మంత్ర తంత్రాలకు సంబంధించిన ముగ్గుకు రత్తి అని పేరు. ఈ ఆకారంలో రెండు త్రికోణాలు-ఒకటి పైకి, మరొకటి కిందికి ఉంటాయి. మధ్యలో వృత్తం. అందులో బిందువూ ఉంటాయి. ఇదే చాలా ఇండ్ల ముందు కనిపించే సాధారణమైన ముగ్గు. మనవాళ్లు పూజించే శ్రీ చక్రం కూడా ఒక విధమైన ముగ్గే. దీనిని బట్టి చాలా ప్రాచీన కాలం నుంచి ఇంటికి రక్షణగా లక్ష్మణుడు సీతమ్మ వారికి రక్షక గీచిన గీత లాగా ముగ్గుల్ని మనవాళ్లు భావిస్తూ వచ్చారు. జానపద స్త్రీలు కొరవజాతి స్త్రీల చేత పచ్చబొట్టు పొడి పించు కొంటారు. అందులో కూడా ఉన్నవి భిన్న విధాలైన ముగ్గులే. ఒక పథకం ప్రకారం మనిషిని బంధిస్తే ముగ్గులుకి దించారని చెబుతారు. అంటే ముగ్గు మన జాతీయమైన ఆచారమని అర్థం. పెండ్లిండ్లలో అవిరేణి కుండలని చాలా రకరకాలుగా ముగ్గులతో రంగురంగుల బొట్లతో అలంకరించడం మనం చూస్తాం.
ఇంటి చుట్టూ గోడమీద ఎర్రమన్నుతో ఒక గీతను గీసే వాళ్ళు. దాన్ని రక్షగాను, శుభకరం గాను భావించేవాళ్లు. ఇంటికి తెల్లగా సున్నం కొట్టించి, కింద పేడతో అలికి, ముగ్గులు పెట్టించి, ఆ ముగ్గులకు అటూ ఇటూ వైపులా ఎర్రని గీతలు గీసేవాళ్లు. మన జాతీయ జెండాలోని మూడు రంగుల మాతృకలాగా ఈ గృహాలంకరణ స్ఫరిస్తుంది.
ముగ్గులలో చాలా రకాలు ఉన్నాయి. చుక్కల ముగ్గు శంకు చక్రాల ముగ్గు, గీతల ముగ్గు, ఇవన్నీ పండుగ సందర్భాలను బట్టి ఇంటి ముందు వేస్తూ ఉంటారు.
సంప్రదాయ కళలు.;- తాటి కోల పద్మావతి గుంటూరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి