వెలుతురు కోసం వేసారిన
రాతిరికి
తూరుపు దిక్కున ఆకాశం
ఎరుపు ఊరట.
దిగులుగా దొరిలిన నిమిషాల
బరువు మోయలేనంతైనా
రేపటికోసం ఎదురుచూపు
అరుదైనదేదో అందబోతున్నదని
అడుగంటని ఆశ
ఆశించినది దొరుకుతుందని
అలుపెరగని ఆరాటం
వేధించే వేదనలనుండీ
విముక్తి కోసం వెదుకులాట
బాధించే గాయాలు మాన్పించే
ఆనందాల కోసం అన్వేషణ
చిరునవ్వులు మొలిపించే
కబురేదో వస్తుందని నిరీక్షణ
నిశ్శబ్దంగా ఎదురుచూసిన
నిన్నటిని మార్చేసే
రేపటికి
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి