సుప్రభాత కవిత ;- బృంద
రాబోయే ఆనందాలకు
మనసును కుంచెను చేస్తే
వెచ్చని వెలుగులు
పచ్చగా కురవడం  చూస్తే

తెరలన్నీ తొలగిపోయి
అరలన్నీ కలిసిపోయి
బాధలు మాసిపోయి
గమ్యం చేరువైపోదూ....

వేదనలెంత కదిలించినా
వేకువకోసం ఎదురుచూపులే!
వెలుగులోని వర్ణాలన్నీ
వెతలను తొలగించేవే!

దారిపొడుగునా
బహుపరాకులే

వడిగా సాగిపోయే
అడుగులకు.....
ఊహల విమానమెక్కి
ఉత్సాహం  తోడుగా
ఉల్లాసం  ఊపిరిగా
ఊయలూగే మనసుకు..

అలసిపోని ఆరాటాలతో
అలసించని అడుగులతో
సాగుతున్న పయనంలో
మధురంగా తోచె జగమంతా

పుత్తడి వెలుగులు కొత్తగ
కురిపిస్తూ 
మదిలో హరివిల్లు
పూయించే  ఉదయానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు