ప్రతి ముంగిలినీ ప్రతిమనసునీ
సత్యాలతో శివాలతో నింపే సుందర
జ్యోతికలశం ప్రభవించింది
అవనిలో ప్రతి అణువూ
కాంతిపుంజపు పలకరింపుతో
కొత్త రంగులు నింపుకుంది
కెరటాలు రంగు రంగుల
సీతాకోకచిలుకల గుంపు
కదులుతున్నట్టుంది
గగనం ఆరువర్ణాల చీర
చుట్టుకుని వేకువకు
నీరాజనమిస్తోంది
కుమ్మరించిన కలశంనుండీ
వెలుతురు పరచుకుని
పుడమికి పుత్తడి తాపడం
చేసినట్టుంది
వేకువ ఒక ఉత్సాహం
వెలుతురు ఒక ధైర్యం
ఉదయం ఒక ప్రోత్సాహం
నింగిని సాగే వెలుగుల గోళం
జగతికి నింపును జీవం శుభం
చెట్టూచేమకు జవం జీవం
జంతుజాలానికి చైతన్యం
మానవాళికి మరో దినం
ఉదయాలు వెలగాలి
హృదయాలు పొంగాలి
దయతో నింపుకోవాలి
అందరి బాగూ కోరాలి
అందరితో కలిసుండాలి
అందరిలో మంచిని పెంచాలి
అందమైన ఉదయానికి
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి