సుప్రభాత కవిత ; -బృంద
పంచభూతాలన్నీ
అర్థంకాని అద్భుతాలే!

గొడుగులా భూమిని కాచే
గగనం 

నిలబడ్డానికి అధారం ఇచ్చే
భూమి

కొండమొదట్లో కూనగా  పుట్టి
కడలిదాకా పయనించే నీరు

క్షణం అందకపోతే  
ఊపిరాడనంతగా ఆవరించిన గాలి

మొక్కలకు ఆహారంగా
జీవులకు అవసరంగా
నీరు నింగిని చేరే క్రమంగా
కల్మషంలేని  గాలికి కారణంగా
అన్నిటికీ ఆధారమైన  అగ్ని.

ఈ పాంచభౌతికమైన దేహంలో
అవి కొలువైన తీరు అద్భుతం

ఏది తక్కువైనా
ఎక్కువైనా...క్షణం దూరమైనా
ఉలికిపడే జీవితాలు

వెలలేని సేవలందిస్తున్నా...
విలువివ్వని స్వార్థానికి
నిష్కృతి ఉంటుందా?

మనదైన  ఉదయానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు