నాగరిక జీవితంలో మనిషి అన్నీ చేయగల శక్తిసామర్థ్యాలు ఉన్న వాడే. అయినప్పటికీ అతను తడబడుతున్న విషయం...ఎవరితో ఎలా మెలగాలి అని?
అందుకతను అనుభవజ్ఞుల, మహాత్ముల ఉపదేశాలను చెవితో కాక హృదయంతో వినాలి. నిజమైనవాళ్ళు, తాగుబోతులు, పిల్లలు తదితరుల నోటంటసైతం కొన్నిసార్లు విని ఆచరించదగ్గ మంచి మాటలు వస్తుంటాయి అని రామకృష్ణపరమహంస తెలిపారు. ఆ మాటలు పట్టుకోవడంలో అప్రమత్తంగా ఉండాలి.
పరమహంస "మనం అందరితోనూ ప్రేమగానూ మర్యాదగానూ మెలగాలి" అని తరచూ చెప్పేవారు. కానీ కొందరి విషయంలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, దూరంగా ఉండాలని కూడా ఆయన అంటారు. కొందరితో మెలిగేటప్పుడు ఆచితూచి అడుగేయాలన్నది ఆయన హితవు.
అటువంటి వారిలో మొదటిది...అతి ధనవంతులు. వారికి ధనబలం, మాట బలం అధికం. వాళ్ళనుకుంటే మీకు హాని చేయగలరు. కనుక వారితో జాగ్రత్తగా మెలగాలి. వారు చెప్పే మాటలు విని "సరేనండీ...అవునండీ" అనే స్థితి రావచ్చు.
రెండవది, తాగుబోతు. నువ్వు అతనిని రెచ్చగొడితే చెవితో వినడానికి సహితం భరించలేని మాటలతో నిన్ను తిడతాడు. అలాకాక "ఏమిటీ బాగున్నావా?" అని అడిగితే నీతో సంతోషంగా మమేకమవుతాడు.
మూడవది ఎద్దు. అది నిన్ను కుమ్మడానికి వచ్చినప్పుడు ఏదో ఒక చప్పుడు చేసి దానిని దారిలోకి తెచ్చుకోవాలి.
నాలుగవది, కుక్క. అది నిన్ను చూసి మొరగడానికో కరవడానికో వచ్చినప్పుడు నువ్వు పరుగెత్తకుండా నిలబడిపోయి ఈల వేస్తే అది తన తీరుని మార్చొచ్చు.
అయిదవది, పాములాంటి విషం కలిగిన మనుషులు. వాళ్ళెప్పుడు నిన్ను కరుస్తారో నీకు తెలీదు. వారి విష విరుగుడికి ఎంతో కష్టించాలి. లేకుంటే వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచన పుడుతుంది. పగలూ ప్రతీకారాలకన్నా మంచిది - అటువంటి వారికి దూరంగా ఉండటం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి