అమ్మ ఉన్నదీ;- గంగదేవు యాదయ్య.
అమ్మ ఉన్నదీ
ఏమీ తిన్నదీ...
అమ్మ ఉన్నదీ
అటుకులు తిన్నదీ...
ఆవు ఉన్నదీ
ఏమీ తిన్నదీ...
ఆవు ఉన్నదీ
ఆకూ- అలమూ తిన్నదీ...
ఈగ ఉన్నదీ
ఏమీ తిన్నదీ...
ఈగ ఉన్నదీ
ఇప్ప పువ్వులు తిన్నదీ...
ఉడుత ఉన్నదీ
ఏమీ తిన్నదీ...
ఉడుత ఉన్నదీ
ఉసిరి కాయ తిన్నదీ...
ఊసరవెల్లి ఉన్నదీ
ఏమీ తిన్నదీ ....
ఊసరవెల్లి ఉన్నదీ
ఉల్లిపాయ తిన్నదీ...
ఎలుక ఉన్నదీ 
ఏమీ తిన్నదీ...
ఎలుక ఉన్నదీ 
ఎల్లి పాయె తిన్నదీ...
ఏనుగు ఉన్నదీ
ఏమీ తిన్నదీ...
ఏనుగు ఉన్నదీ
ఎన్నో ఆకులు తిన్నదీ...
ఒంటె ఉన్నదీ
ఏమీ తిన్నదీ...
ఒంటె ఉన్నదీ
ఒక బండెడు గడ్డీ తిన్నదీ...
ఔజం ఉన్నదీ
ఏమీ తిన్నదీ..
ఔజం ఉన్నదీ...
ఎన్నో దెబ్బలు తిన్నదీ...
కుర్రో - కుర్రో .
============== 
( రచయిత: ఉయ్యాల-  జంపాల : పిల్లల పద్యాలూ గేయాల పుస్తకం).
# నోట్: "ఔజం" ఒక వాయిద్య పరికరం. కొండరెడ్లు అనే ఆదివాసి తెగ వారు వాడుతారు

కామెంట్‌లు
Unknown చెప్పారు…
చాలా బాగంది👌👌👌