ఈ సినిమాని ( శంకరాభరణం ) ఆదరించకపోతే ఆంధ్రులు అంధులు ... అని అన్నారు ఆచార్య ఆత్రేయ గారు .
" శంకరాభరణం " సినిమా గుంటూరు కృష్ణమహల్లో
రిలీజయింది .
మా గుంటూర్లో సినిమా హాళ్లు ... బెజవాడలోనో లేకపోతే కాకినాడలోనో ఉన్నంత గొప్పగా ఉండవు . ఈ విషయం ఇంతకుమునుపోకసారి రాశాను .
అలా రాసినందుకు అప్పుడు మా గుంటూరోళ్లు కొంతమందికి నా మీద చాలా కోపం వచ్చి యాంగ్రీ 😡😡 ఇమోజీలు కూడా పెట్టారు .
అయన్నీ నేను పట్టించుకోలా ... ఎందుకంటే నేనూ గుంటూరోడ్నే కదా ... మా గుంటూరోళ్ల గురించి నాకు బాగా తెలుసు . Blow hot blow cold పెర్సనాలిటీలు . కోపం ఇలా వచ్చి అలా మాయమైపోతుంది .
కారాలు మింగేవాళ్ళమే గానీ ప్రతీకారాలు తీర్చుకునే వాళ్ళం కాదు . 😝😁😂🤠😎🤣
మీకు తెలుసో తెల్వదో నాకు తెల్వదు గానీ " శంకరాభరణం " సినిమా తీసినాయన కూడా మా గుంటూరు జిల్లాలోనే పుట్టారు . గుంటూరు హిందూ కాలేజీలోనూ , ఎ సి కాలేజీలోనూ చదువుకున్నారు . ❤️❤️❤️
హరికథాగానానికి " పద్మ " పురస్కారం తెచ్చిపెట్టిన కోట సచ్చిదానంద శాస్త్రి గారు మా గుంటూరాయనే . ❤️
ఇప్పుడు మళ్లీ ఇంకోసారి రాస్తున్నా . మా గుంటూర్లో సినిమా హాళ్లు పెద్ద గొప్పగా ఉండవు . ఒక మోస్తరుగా ఉంటాయి . కొన్ని సినిమా హాళ్లు పరమ చెత్తగా ఉంటాయి .
అయినా సినిమా హాలు బాగోగులతో మనకేం పని ... ! 🤔అక్కడేమన్నా కాపరం పెట్టటానికి పోతామా ... ! 🤔😝
ఏదో ఓ రెండు గంటలు సినిమా చూడ్డానికి పోతాం గానీ .. ! అని కాంప్రమైజ్ అయిపోయి సినిమా హాలు బాగోగులు గురించి పెద్దగా పట్టించుకోని పెద్ద మనసున్న పెద్ద మనుషులు మా గుంటూరోళ్లు . 😊😊😊
మాలాంటి కుర్ర సజ్జు కొంతమంది బెజవాడ పక్కనే కాబట్టి శలవురోజుల్లో బెజవాడ పోయి సినిమాలు చూసొస్తుండే వాళ్ళు . 😆😁😂😎🤠
సినిమా ( తెలుగు / హిందీ / ఇంగ్లీషు ) రిలీజైన మొదటి రోజు మొదటి ఆట చూడకపోతే చాలా పరువు తక్కువగా ఉంటుంది ... తల కొట్టేసినట్టుగా ఉంటుంది ... నలుగురిలో తలెత్తుకు తిరగలేం ... అని ఓ తెగ ఫీలైపోయే అమాయక చక్రవర్తులం మేవప్పుడు . 😆😁😂😝
ఆనవాయితీ ప్రకారం ఫ్రెండ్స్ అందరం పోలో మంటూ పోయాం సినిమా చూడ్డానికి . మార్నింగ్ షో . టిక్కెట్లు ఈజీగానే దొరికిపోయాయి .
హాలు నిండలేదు . పట్టుమని ఏభై మంది కూడా లేరు హాలు మొత్తం మీద . సినిమా మొదలయింది . మొదలైన కొద్ది క్షణాలకే ... నోటికి పక్షవాతం వచ్చిన వాళ్ళలాగా ... హాల్లో ఉన్న ప్రేక్షకులకి మాట పడిపోయింది . అంతా మూగవాళ్ళై పోయారు . మౌనం తాండవించింది . నిశ్శబ్దం నాట్యం చేసింది . ఎవరి ఉచ్ఛాసనిస్వాశాల శబ్ధం వారికి స్పష్టంగా వినిపించింది .
సినిమా కెళ్తే ఇంటర్వల్లో మేము ఆనవాయితీగా పాటించే తంతు / రివాజు ... చాయ్ సమోసా ఆర్ చాయ్ న్ కూల్డ్రింక్ ... కార్యక్రమానికి చుట్కారా ఇచ్చేసి ... ఒకళ్ళ మొహాలోకళ్ళు చూసుకుంటూ ... మాటమంతీ లేకుండా కుర్చీలకి అతుక్కుపోయి కూచుండిపోయాం .🤔🤔🤔
సినిమా అయిపోయింది . బయటికొచ్చాము నిశ్శబ్ధంగానే . మాకెవరికీ ఇంకా మాట రాలేదు .
నిశ్శబ్ధాన్ని భంగపరుస్తూ మా మిత్రబృందంలో ఒకడు ... అరేయ్ ! సాయంకాలం కలుద్దాం ... అన్నాడు . మౌనంగానే తలలూపాము అందరం .
సాయంకాలం కొత్తపేట బోసుబొమ్మ సెంటర్లో ఉన్న మా ఫ్రెండు గాడి దుకాణంలో కలిసాం .
మేమంతా ఇంకా మౌనముని వేషంలోనే ఉన్నాం . సినిమా చూసి హాలు బయటికొచ్చినప్పుడు నిశ్శబ్ధాన్ని భంగ పరచిన ఫ్రెండు గాడే ... అరేయ్ ! ఈ సినిమా ఎక్కువ రోజులు ఆడదు . మనోళ్ళకి ఇట్టాంటి సినిమాలు పట్టవు . అంచేత మనం ఈ సినిమాని ఆడిన నాల్రోజుల్లోనే ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు చూసెయ్యాలి ... ఇంట్లోవాళ్ళకి కూడా చూపించాలి ... ! ఏవంటారు ...? అని ప్రతిపాదన చేశాడు .
మేమింకా ట్రాన్స్ లోనే ఉన్నాం . బయట పళ్ళా . అలాగే అని తలలు మాత్రం ఊపి ఎవరిళ్లకు వాళ్ళం పోయాం .
మర్నాడు మళ్లీ చూశాం సినిమాని .
ప్రేక్షకుల హాజరిపట్టికలో పెద్ద మార్పేవీ లేదు .
మా అనుభూతిలోనూ పెద్ద మార్పీవీ లేదు .
ఇంట్లో పెద్దవాళ్ళకి చూపించాం . చాలా సంతోషపడి పోయారు పెద్దవాళ్ళు మేవేదో సాధించినట్టు , ఘనకార్యం చేసినట్టు . 🤔😂😁😝
ఏమాత్రం ముఖపరిచయం ఉన్నవాళ్లు ఎదురుపడ్డా ... ఎలా ఉన్నారని అడిగేవాళ్ళం కాదు ... వాళ్ళ కుశలం కనుక్కునేవాళ్ళం కాదు ... శంకరాభరణం సినిమా చూశారా ... ? అని అడిగేవాళ్ళం . 😊😊
అంత పిచ్చిగా ప్రేమించాం ఆ సినిమాని . ❤️❤️❤️
అలా అనోటా ఈనోటా సినిమా గొప్పగా ఉందనే మాట ఊరంతా పాకి ... హాలు నిండిపోయి ... వారం రోజుల ముందు ... రెండు వారాల ముందు అడ్వాన్స్ బుకింగ్ స్టేజీకి వచ్చింది సినిమా .
అయితే , ఈ సినిమాకి word of mouth కాంపెయిన్తో బాటు ... తెలుగు దినపత్రికల్లో ... పెద్ద పెద్ద కవులు , పండితులు , సంగీత విద్వాంసుల తోటి సినిమాకి అనుకూలంగా ప్రకటనలు ఇప్పించేవాళ్ళు .
అన్ని ప్రకటనల కంటే ఆచార్య ఆత్రేయ గారిచ్చిన ప్రకటన నాకు బాగా నచ్చింది .
" ఈ సినిమాని ఆదరించకపోతే ఆంధ్రులు అంధులు "
మార్కెటింగ్కి సంబంధించిన వ్యక్తిగా చెబుతున్నాను . ఆత్రేయ గారి ప్రకటన ఆంధ్రుల అహం మీద బాగా పని చేసింది , ప్రభావితం చేసింది . ఇళ్ళల్లోంచి బయటకి రప్పించింది . సినిమా ఆడుతున్న హాలు వైపు పరుగులు పెట్టించింది . అఖండమైన విజయం సమకూర్చి పెట్టింది .
మిస్సమ్మ , గుండమ్మ కథ , మాయాబజార్ , తెనాలి రామకృష్ణ , ప్రేమించి చూడు , మూగమనసులు ' ముత్యాల ముగ్గు తర్వాత నేను లెక్కలేనన్ని సార్లు చూసిన సినిమా " శంకరాభరణం "
నాకు తెలిసి ప్రేక్షకుడ్ని కుర్చీలోంచి కదలనివ్వకుండా బంక పెట్టి అతికించినట్టు కూర్చోబెట్టిన మొట్టమొదటి సినిమా " శంకరాభరణం " . 🙏🙏🙏
ప్రేక్షకుడ్ని సినిమా చూస్తున్నంతసేపూ చుట్టుపక్కల పరిసరాల్ని మర్చిపోయి మాటమంతీ లేకుండా మూగవాడిలాగా చేసిన సినిమా " శంకరాభరణం " . 🙏
ప్రేక్షకుడ్ని హిప్నొటైజ్ చేసి ఒక విధమైన ట్రాన్స్ లోకి తీసుకెళ్లిన సినిమా " శంకరాభరణం " .
గుళ్ళోకెళ్లినంత పవిత్రంగా సినిమా హాలుకి వెళ్లేలా చేసిన సినిమా " శంకరాభరణం " 🙏🙏🙏
క్లాసు , మాసు తేడా లేకుండా , పండిత పామర తేడా లేకుండా , భాషా భేదం లేకుండా , కుల మత , ప్రాంత భేదం లేకుండా ఎంతో గౌరవంతో , ప్రేమతో , ఆదరణతో చూసి మురిసిపోయిన సినిమా " శంకరాభరణం " . 🙏🙏🙏
శాస్త్రీయ సంగీతం పట్ల జనబాహుళ్యంలో విపరీతమైన మోజు , ఆకర్షణ కలిగించిన సినిమా " శంకరాభరణం " . 🙏🙏🙏
కుటుంబ సభ్యులతోటి , బంధుమిత్రుల తోటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్జాగా కాలి మీద కాలేస్కుని చూడదగ్గ సినిమా " శంకరాభరణం " . 🙏🙏🙏
సినిమా ఘనవిజయం సాధించటానికి STAR VALUE ఏమాత్రం అవసరం లేదని ఢంకా బజాయించి చెప్పిన సినిమా " శంకరాభరణం " . 🙏🙏🙏
దర్శకుల వారి కంటే ముందు అసలు STAR VALUE ఏమాత్రం లేని కథని తెరకెక్కించడానికి సాహసిం చేసిన నిర్మాతలకు 🙏🙏🙏 .
" శంకరాభరణం " సినిమాకి ఆ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా 🙏🙏🙏🙏🙏🙏🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి