సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయములు-34
కాకోలూక నిశా న్యాయము
*****
కాకము అంటే కాకి. ఉలూకము అంటే గుడ్ల గూబ. నిశా అంటే రాత్రి.
ఈ మూడింటిని కలిపి ఓ చక్కటి న్యాయమును సృష్టించిన మన పూర్వీకుల నిశిత దృష్టి ఎంత గొప్పదో కదా!దానిని మానవ జీవితానికి అన్వయింపజేసిన విధం చూస్తుంటే, ఎవరికైనా భలేగా అనిపిస్తుంది.
కాకి,ఉలూకమూ రెండూ పక్షులే అయినా రాత్రి పూట కాకికి కళ్ళు కనపడవు.గుడ్లగూబకు పగటి పూట కళ్ళు కనబడవు.
కాకి కేవలం పగటి పూటే స్వేచ్ఛగా తిరుగుతూ  ఆనందంగా ఉండగలుగుతుంది.కానీ రాత్రి పూట తిరగలేదు.అందుకే దానికి రాత్రి ఇబ్బందికరం.
అలాగే గుడ్లగూబకు పగటి వెలుతురులో కళ్ళు కనిపించవు.అది పగటి పూట ఎటూ తిరగలేదు.దానికి పగలు రాత్రితో సమానం. అంటే గుడ్ల గూబకు పగలు ఇబ్బందికరం అన్న మాట.
ఇలా ఒకరికి సంతోషం కలిగించే అంశం కానీ సందర్భం కానీ మరొకరికి బాధ కలగించడం,ఒకరికి బాధ కలిగించే విషయం మరొకరికి సంతోషం కలిగించడం... 
ఇలా ఒకే పరిస్థితి,ఒకే సందర్భం అనేది ఇరువైపులా ఓకే రకమైన అనుభవాలను ఇవ్వాలి.కానీ ఇలా ఒకరికి ఆనందం,మరొకరికి ఆవేదన కలిగించే సందర్భంలో  ఈ కాకోలూక నిశా న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
ప్రస్తుతం ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించిన పరిస్థితులకు  ఈ "కాకోలూక నిశా న్యాయమును" చక్కగా వర్తింపజేసుకోవచ్చు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏


కామెంట్‌లు
Popular posts
చిత్రాలు ; ..జ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భారత్ నగర్ (మూసాపేట)- హైదరాబాద్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
చిత్రాలు ; జి.జీవనజ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భరత్ నగర్ హైదరాబాద్
చిత్రం
తెలివితేటలు!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం