ఏడ్పు!అచ్యుతుని రాజ్యశ్రీ

యాక్సిడెంట్ లో చనిపోయిన వారిని తల్చుకుంటూ పెద్దగా ఏడ్వసాగారు.ఆబస్సు ప్రమాదం లో కూతురు ని పోగొట్టుకున్న ఆతాత కుయ్ కయ్ అనకుండా శిలలా కూచున్నాడు. ఏడాది క్రితమే భార్య పోయింది. వితంతువు ఐన కూతురు దగ్గర ఉన్నాడు.కొడుకు విదేశంలో ఉన్నాడు.తిండి బట్టకి లోపంలేదు.ఇల్లు ఉంది. ఆయన కి పెన్షన్ వస్తుంది. ఆమె కొడుకు వారంక్రితమే ఉద్యోగం లో చేరాడు. తన తల్లి శవం ఇంటికి రాగానే మనవడు భోరున ఏడుస్తున్నా తాత ఏడవకుండా బొమ్మలా కూచోటం చూసి ఆఅబ్బాయి"తాతా!తాతా!" అని చేత్తో కుదుపుతున్నా తాత అలాగే ఉండటం చూసి ఠాప్ మని తాత చెంపపై కొట్టాడు.చుట్టూ ఉన్న జనం దిగ్భ్రమతో చూస్తూనే ఉన్నారు.తాత ని తన తల్లి శవం దగ్గరకు లాక్కెళ్ళగానే భోరుమంటూ డొక్కలు ఎగిసిపడేలా తాత పెద్ద పెట్టున రోదించసాగాడు.మనవడికి పొగరు అని భావిస్తున్న జనంతో అన్నాడు " మాతాత షాక్ లో ఉన్నారు. అలా ఉంటే చాలా ప్రమాదం! దు:ఖంలో మనిషి పెద్దగా ఏడ్వాలి.ఆనందంలో కేరింతలు కొట్టినట్టు దు:ఖంలో బిగ్గరగా ఏడిస్తే  మనసు తేలిక పడుతుంది. అందుకే  మాతాత ని కొట్టాను"అని తాత నిగట్టిగా పట్టుకుని ఏడ్వసాగాడు.ఇప్పుడు తాత మనలోకంలోకి వచ్చాడు.అప్పుడు అర్థం ఐంది  అందరికీ అతని ఆత్మీయత ఆవేదన 🌹 
కామెంట్‌లు
mala kumar చెప్పారు…
ఏడుపు గురించిన చిన్న కథ బాగుంది.