తెలుగు భాష మాధుర్యాన్ని సుసంపన్నం చేస్తున్న ప్రక్రియలో గీతి గుణం గల జానపద గేయాలు, జోల పాటలు, పల్లె పదాలు, తత్వాలు, దండకాలు, కీర్తనలు, సినిమా పాటలు సముచిత స్థానం వహించాయి.
చివరిదాకా మాధుర్యాన్ని కూర్చేది సంగీతం. ఆలోచించ గలిగితే మాధుర్యం ఇచ్చేది సాహిత్యం. అయినా ఆలోచన మృతమైన సంగీతం, ఆపాత మధురమైన సాహిత్యం కూడా ప్రక్రియలో దర్శించగలం. అవి ఒక్కొక్కటి రసగుళికలై ఉంటాయి. ఒక్క మారు మనసు లగ్నం చేసి వింటే చాలు, ఆ చరణాలు మనల్ని విడవకుండా వెన్నాడుతాయి. ఆ గాన మాధుర్యంలో పడి అన్ని మరచిపోతాం. పిల్లలూ! మీరు సెలవు రోజుల్లో బామ్మ దగ్గర, తాతయ్యలా దగ్గర ఇంటికి వస్తూ పోయే వాళ్ల దగ్గర, వీటిల్ని సేకరించి భద్రపరచుకోండి. మీరు మీరుగా ఆనందిస్తారు. అప్పుడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు చెప్పిన తెలుగుజాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అనే సత్యం గ్రహిస్తాం. శంకరంబాడి సుందరాచార్యుల వలె"మా తెలుగు తల్లికి మల్లెపూదండ"అంటూ ఆరాధిస్తాం.
మన భాష మాధుర్యాన్ని తారస్థాయికి చేర్చడంలో పద్య నాటకాలు ప్రముఖంగా నిలుస్తున్నాయి. ఆ రోజులలో గంటల తరబడి ప్రదర్శింపబడేవి. కుల మత వర్గా వివక్ష లేకుండా అందరూ చూచి ఆనందించే వాళ్లు. ఇలా పండితులకు పామరులకు ప్రీతిపాత్రమైన నాటకాలలో తిరుపతి వెంకట కవుల పాండవోద్యోగ విజయాలు బావా!, ఎప్పుడు వచ్చితీవు, జెండాపై కపిరాజు వంటి పద్యాలు ఇప్పటికీ మన నాలుకలపై తాండవిస్తూనే ఉన్నాయి.
అష్టావధానం, భువన విజయం వంటి ప్రదర్శనలు కూడా బహుళ జనాకర్షణీయాలు. బాలలు వీటిని చూడటం వల్ల ధారా, ధారణ, ధిషణ, ధోరణి, ధైర్యం అలవరచుకుంటారు. పద్య విద్యా ప్రభావాన్ని కాపాడే దిశగా ముందడుగు వేస్తారు.
గీతి మాధుర్యం.; -తాటి కోల పద్మావతి గుంటూరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి