నిన్నూ తలస్తే
కష్టాలు తొలుగునంట
నీయాఙ్ఞ లేనిదే
చీమైనా కుట్టదంట
నందీశ్వరుడే
నీకు వాహనంబంట
డమరుకమే
నీకు వాయిద్యమంట
పార్వతీడేవి
నీలోభాగమంట
మీరుద్దరూకలసి
ఆదిదంపతులంట
విఙ్ఞాలుతొలగించు విఙ్ఞేశ్వరుడే
మీ కుమారుడంట
కైలాసమే మీకు
ఆవాసస్థానమంట
అభిషేకమంటే
నీకు మిక్కిలీప్రీతంట
నమ్మినవారిని
నీవు వమ్మూచేయవంట
త్రిశూలమే
నీకు ఆయుధమంట
నాగరాజే
నీకు ఆభరణమంట
నీ జుట్టునుండే
గంగ ప్రవహించునంట
నీ తలపైనే
జాబిల్లి నివసించునంట
ఆకలితీర్చు
అన్నపూర్ణే నీసతియంట
దప్పికాతీర్చే
గంగాదేవే నీపత్నియంట
భక్తులపాలిట
నీవు కొంగుబంగారమంట
దుష్టులపాలిట
నువ్వు సింహస్వప్నమంట
పుట్టించేవాడు
బ్రహ్మంట
గిట్టించేవాడివి
నువ్వంట
నటరాజువై నీవు
నర్తించుతావంట
నిను కొలుచువారిని
రక్షించుతావంట
కోరినకోర్కెలుతీర్చే
భోలాశంకరుడవంట
కోపమొస్తే
నువ్వు రౌద్రరూపుడువంట
నువ్వు మూడొకన్నుతెరిస్తే
ముల్లోకాలు భస్మమగునంట
నువ్వు కరుణచూపావంటే
శాంతిసౌఖ్యాలొనగూరునంట
శివశివాయంటాము
పూజలూచేస్తాము
హరహరాయంటాము
హారతులుయిస్తాము
నమశ్శివాయంటాము
నమస్కారాలుచేస్తాము
బసవుడినికొలుస్తాము
భక్తులముయవుతాము
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి