ప్రపంచ జీవరాసుల్లో దానధర్మాలు చేసే అవకాశాన్ని కేవలం మనిషికే ఇచ్చాడు దేవుడు. అయితే... ఎవరికి దానం చేయాలి? ఎవరికి చేయకూడదు. అనే విషయానికొస్తే... అధర్మఫలం వల్ల వచ్చే పాపాన్ని దానం చేసి పోగొట్టుకుందాం అనుకుంటే... ఆ దానం వల్ల మరింత పాపం సంభవిస్తుంది తప్ప పుణ్య ప్రాప్తి కలుగదు. దానం అనేది పుణ్య ఫలంతోనే చేయాలి. అంతేకాదు... కడుపు నిండిన వాడికి చేసే దానం వృధా. బ్రాహ్మడైనా సరే.. ఆకలి గొన్నవాడికీ, అవసరం ఉన్నవాడికి మాత్రమే దానం చేయాలి. అప్పుడే తగు ఫలితం లభిస్తుంది. అన్ని దానాల్లో గొప్పది అన్నదానం. ఎందుకంటే.. ‘ఇక చాలు’ అనే తృప్తిగా అనగలిగేది అన్నం తిన్నాకే. డబ్బు ఇచ్చినా, బంగారం ఇచ్చినా, జ్ఙానం ఇచ్చినా.. ‘ఇక చాలు’ అనే పదం దానం తీసుకునే వ్యక్తి నుంచిరాదు. ధన, కనక, వస్తు, వాహన దానాలు అందుకునే వారికి తృప్తి కలగదు. కేవలం అన్నదానం అందుకునే వారికే తృప్తి కలుగుతుంది. అందుకే.. అన్నదానం గొప్పదానం.
అన్నదానం కోటి గోవుల దాన ఫలితంతో సమానమైనది. ఏది లోపించినా బ్రతకగలం. కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేం. "దానాలన్నింటిలోకెల్లా అన్నదానం మిన్న" అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని పెద్దలు చెప్తారు. మనిషి ఆశకు అంతులేదు... అదుపు అంతకన్నా ఉండదు, ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా... ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. కానీ అన్నదానంలో మాత్రం దానం తీసుకున్నవారు ఇంక చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు. ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్నవారిని మనం సంతృప్తిపరచలేకపోవచ్చు కాని అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్నవారిని పూర్తిగా సంతృప్తి పరచవచ్చును. అన్నదానాన్ని ఒక యజ్ఞంలా భావించి చేసేవారు కూడా ఉన్నారు. ఆకలిగొని ఉన్నవారికి అన్నదానం చేయలేకయినా అన్నం పెట్టే ఇంటినైనా చూపించమని పెద్దలు చెప్తారు.
అన్న దానం చేయడంలో ఏ మాత్రం పక్షపాత వైఖరిగాని 'పరతమ' భేద వైఖరి అస్సలు ఉండ కూడదు, చూపకూడదు. సంపద గలవారికి, అధికారం గలవారికి, బందుమిత్రులకు ప్రత్యేకంగా ఆతిధ్యం ఇస్తూ పేదవారిని తక్కువ చేసి చూస్తే అది అపాత్ర దానం అవుతుంది. బందుమిత్రులనే ప్రీతిలేకుండా ఉండి ఆర్ధిక స్థోమత లేని, శారీరక శక్తి లేనివారికి వృద్దులకు, ఆభాగ్యులకు సాక్షాత్తు భగవంతునికే అన్ననివేద సమర్పిస్తున్నామన్న భావన చెందుతూ మనస్పూర్తిగా అన్నదానం చేస్తే ఆ పుణ్యఫలం రెట్టింపౌతుంది. పేదవారిని పక్కనబెట్టి అయినవారికి ముందుగా వడ్డిస్తే అన్నదాన పుణ్యఫలం లభించదు. అన్నదానం అంటేనే మనతో ఏ బంధం లేనివారు, నిరుపేదలను "దరిద్ర నారాయణులు" భగవంతునిగా భావించి చేసే మహత్కార్యం ఇది. అన్నదానం జరిగే చోటకు భగవంతుడు పేదవారిగా రూపం దాల్చి వస్తాడు అని పురాణ ఆధారాలున్నాయి.
సి హెచ్ ప్రతాప్
MOBILE no : 95508 51075

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి