న్యాయాలు -55
గుడోపల న్యాయము
*******
గుడము అంటే బెల్లము. ఉపలము అంటే రాయి. గుడోపలము అంటే బెల్లం కొట్టిన రాయి.
మరి గుడోపల న్యాయము అంటే ఏమిటో చూద్దాం.
రాయితో మనం ఏం చేస్తాం. దానితో దేనినైనా కొడితే పెద్ద శబ్దం వస్తుంది. వేరే రాతి మీద గట్టిగా కొడితే నిప్పు రవ్వలు కూడా వస్తుంటాయి. ఇలాంటి వాటికి ఉపయోగించే రాయి సాధారణంగా గుండ్రంగా ఉంటుంది కాబట్టి కొంచెం కదిలించినా దొర్లుకుంటూ పోతుంది.
అలాంటి రాయితో బెల్లం దిమ్మెను లేదా బెల్లం ముద్దను కొడితే మొదటి సారి కొంచెం చప్పుడు అవుతుంది. కొంత వరకు ముక్కలుగా విడిపోతుంది.
కానీ రెండో సారి కొట్టినప్పుడు చప్పుడు రాదు. ఎందుకంటే బెల్లం ముద్ద మెత్తగా ఉంటుంది కాబట్టి అది కొంత రాయికి అతుక్కుంటుంది. ఆ రాయితో ఎంత కొట్టినా శబ్దం రాదు.ఠంగుమని మోగదు. నిప్పు రవ్వలైతే అసలే రావు. దానిని ఎక్కడ పెట్టినా అటూ ఇటూ కదలకుండా అలాగే ఉంటుంది.
బెల్లం కొట్టిన రాయిలా స్తబ్దుగా ఉలుకూ పలుకూ లేకుండా ఉన్న వారిని ఉద్దేశించి ఈ గుడోపల న్యాయమును ఉదాహరణగా చెబుతూ ఉంటారు.
ఏదైనా సమస్య, సందర్భం వచ్చినప్పుడు మాట్లాడకుండా, సమాధానం ఇవ్వకుండా, బదులు చెప్పకుండా మందకొడిగా ఉన్నవారిని చూస్తే ఇవతలి వారికి బీపీ మామూలుగా పెరగదు.మస్తు ఆవేశం వస్తుంది. లేచి నాలుగు తగిలించాలన్నంత కోపం వస్తుంది. ఆ సమయంలోనే ఇదిగో ఇలాంటి న్యాయాన్ని ఉపయోగిస్తారు. "ఏంటలా బెల్లం కొట్టిన రాయిలా" ఉన్నావని తిట్టడం జరుగుతుంది.
ఇలా ఏ చలనం లేకుండా, సమాధానం చెప్పకుండా, ఎదురు తిరగకుండా , ఏమన్నా తనను కాదన్నట్లు, అక్కడ జరుగుతున్న వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదన్నట్లు పట్టించుకోకుండా ఉండే సదరు వ్యక్తిని ఉద్దేశించి " ఛీ! ఛా! ఏం మనిషిరా బాబూ!"ఉట్టి శుద్ధ బుద్ధావతారం ", "బెల్లం కొట్టిన రాయి" అంటాం.
గుడోపల న్యాయము ఇలాంటి వారికి చక్కగా సరిపోతుంది. అలాంటి వాళ్ళను చూసినప్పుడు మనకు ఈ న్యాయము గుర్తుకు వచ్చి ఆవేశం స్థానంలో నవ్వుతో బాటు "ప్చ్! వీళ్ళని మార్చడం ఎలా? అనే దిగులు కూడా మనసును వెంటాడుతుంటుంది కదూ!".
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి