రవి
ఉదయించాడోలేదో
తెల్లవారింది
వెలుగు
ప్రసరించిందోలేదో
మెలుకువవచ్చింది
నిద్ర
లేచానోలేదో
దంతధావనంచేశా
తలుపు
తీశానోలేదో
ఇంటికి పత్రిక పాలువచ్చాయి
వార్తపత్రిక
చదివానోలేదో
చేతికి కప్పుకాఫీవచ్చింది
వేడివేడికాఫీ
త్రాగానోలేదో
వంటికి ఉషారొచ్చింది
మనసు
మురిసిందోలేదో
చక్కని తలపొచ్చింది
కలము
చేతపట్టానోలేదో
కమ్మని కవితపుట్టింది
సమూహాలలోకి
కైతను పంపానోలేదో
అద్భుత స్పందనలొచ్చాయి
సూర్యోదయ మహత్యమో
వేడివేడికాఫీ మహత్యమో
భార్యామణి మహత్యమో
ఆలోచన తట్టింది
కలము కదిలింది
కవితోదయమయింది
ప్రొద్దుప్రొద్దునే
ప్రతిస్పందించిన
పాఠకులకు
పలుధన్యవాదాలు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి