నేను ఉన్నాను
నా చుట్టూ గాలి మీరు
నేను ఇంకా
ఊపిరి తీసుకుంటూనే ఉన్నాను!!
నేను ఉన్నాను
నా చుట్టూ నీరు మీరు
నేను ఇంకా
నీరు త్రాగుతూనే ఉన్నాను!!!
నేను ఉన్నాను
నా గుండె మీరు
నా గుండె ఇంకా
కొట్టుకుంటూనే ఉంది!!?
నేను ఉన్నాను
నాకు అన్నం పరబ్రహ్మ స్వరూపం
మీరు
నేను ఇంకా ఆకలి గొంటునే ఉన్నాను
తింటూనే ఉన్నాను!!!
నేను ఇంకా ఉన్నాను
నా నోటి మాటలు మీరు
నేను ఇంకా
ఆలోచిస్తూనే ఉన్నాను!!!!
ఎవరన్నారు నేను లేనని
మీరు లేరని
నేను ఉన్నాను
మీరు ఉన్నారు!!
ఎవరన్నారు పంచభూతాలు లేవని
పంచేంద్రియాలు పనిచేస్తూ లేవని
ప్రాణం లేదని!!!?
విశ్వాసం ఉంటే చాలు
విశ్వానికి
పరిచయము అక్కరలేదు
విజయం అక్కరలేదు!!!?
Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి