తియ్యని పండ్లను కాసే చెట్లు తమ కాయలను అవి భుజింపవు. ఆవులు, గేదెలు తమ పాలను తాము వాడుకోకుండా మానవాళికే అందిస్తాయి. దాహం తీర్చే నదీ జలాలు ప్రాణికోటి దాహార్తిని తీర్చి సేవ చేస్తున్నాయి. అడగకుండానే మేఘాలు వర్ష ధారలను కురిపించి పుష్కలంగా పంటలు పండడానికి దోహదం చేస్తున్నాయి.
సేవ అనేది ధర్మాలన్నింటిలోకల్లా ఉత్తమ ధర్మం. పరమ పవిత్రమైన ఈ భూమిపై పుట్టిన మహనీయులంతా కుల, మత జాతులకు అతీతంగా మానవసేవే మాధవసేవ అని బోధించి సేవా ధర్మాన్ని ఆచరించి తరించారు. అయితే ఈ సేవ అనేది ప్రతిఫలం ఆశించకుండా చేసినపుడే అది నిజమైన సేవ అనిపించుకుంటుంది. పేరు ప్రతిష్ఠలు, ధనం, అధికారం లాంటివి ఏవో ప్రయోజనాలు ఆశించి చేసే సేవలో స్వార్ధం ఉంటుంది.
ప్రపంచానికి సేవ చేయడమే మన మొట్టమొదటి, ప్రధాన కర్తవ్యం కావాలి. సేవ ఒక్కటే జీవిత లక్ష్యమైనప్పుడు మనలో భయాలు,ఆందోళనలు, నిరాశావాదం, నిరాసక్తత తొలగి పోతాయి. బుద్ధి కేంద్రీకృతమవుతుంది. చేసే ప్రతీ పని ఉపయోగక రమవుతుంది. దీర్ఘకాలం నిలిచే అనందం కలుగుతుంది.
మనం చేసే సేవ వలన సహజత్వం, మానవీయ విలువలు సమాజం లో పెంపొందుతాయి. తద్వారా భయం, నిరాశానిస్పృహలు లేని సమాజ నిర్మాణంలో మన సేవ సహాయకారి కాగలదు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి