బ్రహ్మ, నారద సంవాదంలో.....
సర్వదేవమయ రథ వర్ణన - శివుడు యుద్ధమునకు వెళ్ళుట - పశుపతి అని పేరు - గణేశుని పూజ - త్రిపుర దహనము - మయుడు, త్రిపురాసురుని కొడుకులు బయట పడుట......
*"ఓం నమః శివాయ శుభం శుభం కురు కురు శివాయనమః ఓం"*
*నారదా! అశరీరవాణి చెప్పగా, చండీ సహితంగా, తనలీలా వినోదంలో భాగంగా, లోకాచారం ప్రకారం గణపతిని పూజించి, ఈ పూజ యొక్క ఆవశ్యకతను మనకు తెలియపరచిన తరువాత, త్రిపరముల దగ్ధానికి రుద్రని రథం బయలుదేరింది. అప్పుడు, దేవతలు మునులు ఋషులు శంకరునితో "మహానుభావా! పరాత్పరా! తారకాసురుని కుమారులు, త్రిపురాలలో ఉండేవారు అయిన రాక్షసుల సంహారానికి సమయం దగ్గర పడింది. త్రిపురములు ఒక వరుసలోకి వచ్చాయి. ఆ పురములు మూడు మళ్ళీ వేరు వేరు స్థానములకు వెళ్ళక ముందే, మీ అమేయమైన బాణమును వదలి, ఆ త్రిపురములను కాల్చివేసి, రాక్ష సంహారము కూడా పూర్తి చేయండి" అని వేడుకున్నారు.*
*త్రిపురములను ఒకే వరుసలో చూసిన శంభుడు, అభిజిత్ లగ్నంలో, తన ధనస్సుకు అల్లె త్రాడు బిగించి, పరమ పూజ్యమైన "పాశుపతాస్త్రం" ను సంధించి, దుస్సహమైన సింహనాదం చేస్తూ, త్రిపురముల మీద ప్రయోగించారు. కోటి మంది సూర్యుల ప్రభావముతో సమానమైన పాశుపతం దైవకార్యం కోసం, శివుని ఆజ్ఞగా దైత్యుల వైపు కదిలింది. ఆ పాశుపతం మొన మీద అగ్ని దేవుడు ఉన్నందు వలన, ఆ అస్త్రం పాపనాశకమై, విష్ణుమయమై ఉంది.*
*మహాద్భుతంగా నిప్పులు కక్కుతూ వచ్చిన ఆ పాశుపతం ప్రభావానికి త్రిపురాసురుల మూడు పట్టణాలు కాలి మశి అయ్యి, భూమిద పడిపోయాయి. ఆ పాశుపతం విడిచిన నిప్పుల వల్ల శివ పూజను వదలి వేసిన దైత్యులు అందరూ మరణించారు. ఆ మంటలలో తనతో సహా కాలిపోతున్న తన ఇద్దరు సోదరులను చూచిన తారకాక్షుడు తన ఆరాధ్య దైవం అయిన శంభునితో, "భవా! మీరు మా యందు ప్రసన్నం అయ్యారు, కనుకనే, దేవతలకు కూడా దొరకని, మీ చేతిలో మరణించే భాగ్యం మాకు కలిగింది. మేము ఎక్కడ, ఎలా ఉన్నా, మీ సేవా భాగ్యం దూరం కాకుండా అనుగ్రహించండి." అనిమహాదేవుని కోరుకున్నారు.*
*అలా వారు ప్రార్థన చేస్తుండగానే, పాశుపతాస్త్రం నుండి వస్తున్న మంటలలో కాలి బూడిద అయ్యారు, తారకాసురుని కుమారులు ముగ్గురూ. ఆ మూడు పురాలలో ఉన్న అందరూ కూడా ఆ మంటలలో మాడిపోయారు. కానీ, మయుడు మాత్రము ప్రాణాలతో బయట పడ్డాడు. మయుడు, రాక్షస పక్షపాతి అయినా, దైవ ద్రోహి, విరోధి కాడు. ఆపదలు వచ్చినప్పుడు, శంభుని శరణు కోరుకుంటూ ఉంటాడు. అందుచేత, మయుడు పాశుపతం నుండి, కాపాడ బడ్డాడు. కనుక, "మంచి వారు అందరూ ఉత్తమ కర్మలను ప్రయత్న పూర్వకంగా చేయాలి. అలాగే, చెడు పనులు చేయడం వలన ప్రాణులు నాశనమౌతారు. మానవులు, చేయగూడని పనులను ఏమరపాటున కూడా చేయకూడదు." శివపూజా తత్పరులైన వారు రాక్షసులు అయినా కూడా, తరువాతి జన్మలో గణములకు అధిపతులు అయ్యారు. ఇంత గొప్పదైన శివపూజను మానసికంగా అయినా, ప్రతీ నిత్యం చేసుకోవాలి.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి