మండుటెండను సైతం లెక్కచేయకుండా 56 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1470 కిలోమీటర్ల పాదయాత్ర విజయవంతంగా పూర్తి చేసినవాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అని గుండె మీద చేయి వేసుకుని చెప్పవచ్చు. 2004లో ముఖ్యమంత్రిగా రాజీవ్ పల్లె బాట ప్రారంభించిన మహానుభావుడు ప్రజలకు చేరువ కావడానికి యాత్రలను కొనసాగించారు ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకోవడం కోసం జూన్ 13 2004లో రాజీవ్ పల్లె బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. సుమారు 40,000 వినతులను అందులో సేకరించారు. 2005 లో పల్లె బాట అనంతరం సెప్టెంబర్ 1, 2005 నుంచి నగరబాట మొదలుపెట్టారు. పట్టణ ప్రాంత ప్రజల కష్ట సుఖాలను నేరుగా తెలుసుకోవడానికి నగరబాటను వేదికగా చేసుకున్నారు.
రెండవసారి అధికారం చేపట్టిన తర్వాత ప్రజా వినతులను స్వయంగా వినడానికి తాజాగా రచ్చబండ కార్యక్రమానికి సెప్టెంబర్ 2న ఉదయం చిత్తూరు జిల్లా బయలుదేరారు. కుటుంబంలో నలుగురి నడుమన మాత్రమే మెలగిన వాడైనా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న సమయంలో నైనా ఏ ఒక్కరికి అనుచిత ప్రాధాన్యం దక్కనివ్వని సమదృష్టి ఆయనది. అనుబంధాన్ని మాయగా చూపి అగ్రాసనం పొందటం, మాటలతో మభ్యపెట్టె మన్నన దక్కించుకోవడం ఆయన వద్ద అసాధ్యం ఆయన వ్యవహారంలో ఎవరి ప్రాధాన్యం వారికుంటుంది. ఇంట్లో వాళ్ళకి ఇచ్చే ప్రాధాన్యం ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి ఇచ్చే ప్రధాన్యం బయటి వాళ్ళకి ఉంటుంది ఇంట్లో కూడా పనిమనిషి మధ్య ఎవరి ప్రాధాన్యం వాళ్ళదే వాళ్ళకి ఇచ్చే ప్రధాన్యం బయట వాళ్ళకు ఉంటుంది. మనుషులకు ఆయన ఇచ్చే విలువ ప్రాధాన్యంలో స్థాయి భేదాలు ఉండవచ్చు. ఆ భేదాలు కూడా అందరూ ఇష్టపడేవే. మానవత్వాన్ని ప్రేమించడంలో ఆయన నీటి చలమ లాంటి వ్యక్తి నిత్యం ఊరే నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుంది తమ తమ శక్తిమే రా ఆర్తి తీరా ఎందరు ఆ నీటిని తోడుకున్న, వాడుకున్న ఇంకా ఎలా ఊరుతూనే ఉంటాయో ప్రేమ తత్వంలో ఆయన అలాంటివారు సన్నిహితంగా ఉంటూ ఆయన ప్రేమకు పాత్రమైన భాగ్యశ్రీలురను ఈ రాష్ట్ర ప్రజల యావత్తు మాతో సమానంగానే ఆయన ప్రేమకు పాత్రులు కాగలిగారు. ఎవరికి తగిన విలువ వారికి ఇస్తూ ఆయన అందరి ప్రేమను అంతే సమానంగా పొందగలిగారు కూడా చిన్నవాడు అంటే ఆయనకు మరింత ప్రేమ పసిపిల్లలంటే అవ్యాజ అనురాగాలు.
జననేత - వై.ఎస్.ఆర్ (11); - ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి