రెడ్డి రాజులు (2);- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 అలా ఆ గంటసేపు కాలక్షేపం చేసి బయటకు వచ్చి ఉపాధ్యాయునికి  తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు అభినందనలు తెలియజేసి  వెళదామని బయలుదేరేసరికి  దాదాపుగా తరగతిలో ఉన్న ప్రతి  బాలికా నా వెంటపడి మాట్లాడుకుంటూ  మేడం దగ్గరికి వెళ్ళాము  ఆమెతో మాట్లాడటం మొదలు పెట్టినప్పుడే  ముందు ఆమె నాకు అభినందనలు తెలియజేసి  మీరు గంటసేపు వారితో చేసిన కార్యక్రమం  నాకు నచ్చింది. మిమ్మల్ని అభినందిస్తున్నాను అన్న తరువాత  మీరేమీ అనుకోకపోతే  నాకు ఒక చిన్న అవకాశాన్ని ఇవ్వండి  నాకు ప్రతివారం ఒకరోజు  సెలవు ఉంటుంది  ఆరోజు నేను  వచ్చి ఈ పిల్లలతో కాలక్షేపం చేసే అవకాశాన్ని కల్పించండి. నేను మనసులో ఏమనుకున్నానో ఆ విషయాలన్నీ పిల్లలతో పంచుకోవాలని  నా ఆకాంక్ష అన్నాను. ఆమె ఎంతో ఆనందించి  లేచి నా దగ్గరకు వచ్చినన్ను కౌగలించుకొని  మీలాంటి తెలివైన యువతి  మా పిల్లలకి  అక్షర జ్ఞానం  కల్పిస్తానంటే వద్దనే అవివేకని కాను  మీకేమీ అభ్యంతరం లేకపోతే  ప్రతివారం మీరు ఏ సమయానికి రావాలనుకున్నారో  ఆ సమయానికి మీకు వాహనాన్ని ఏర్పాటు చేస్తాం  మీరు మరో విధంగా భావించనంటే  నాలుగు వారాలకు కలిపి  ఒక్కసారి మాకు తోచిన వారితోషికం ఇవ్వడానికి  అంగీకరించమన్నది. నాకు ఆశ్చర్యంతో పాటు సిగ్గు కూడా వేసింది  మాస్టారు  మన పిల్లలను చూసి ముచ్చటపడి  వారి అల్లరిని ఆ స్వాదించడానికి ఇక్కడికి రావాలనుకుంటున్నాను తప్ప  ఏ రకమైన పరితోషికము కానీ  వాహన సదుపాయాలు కానీ చేయవద్దు  నన్ను అపార్థం చేసుకోకండి  నిజానికి  ఆ పిల్లలతో నేను ముద్దు ముచ్చట్లు అనుభవిస్తున్న దానికి  నేనే మీకు కొంత చెల్లించాలి అనేసరికి  ఆమె కంటి వెంట వచ్చిన నీరు  కింద పడకుండా జాగ్రత్త పడటం గమనించాను.
డాక్టర్ స్వాతి గారు  నా జీవితంలో మొదటిసారి ఇంత ఆనందాన్ని అనుభవించడం  నాకే ఆశ్చర్యగా ఉంది  మా బడికి ఎంతో మంది విద్యాధికులు  సంఘ సేవకులు వస్తూ ఉంటారు. ఏ ఒక్కరికి  ఇప్పుడు మీకు వచ్చిన ఆలోచన రాలేదు  పిల్లల భవిష్యత్తును గురించి ఆలోచించాలన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా  వారు సేవా తత్పరులుగా  సమాజంలో తిరుగుతున్నారు.  ఈ క్షణాన వారిని తలుచుకుంటే నాకు ఎంత అసహ్యం వేస్తుందో  పిల్లలకు లోకజ్ఞానాన్ని చెప్పాలన్న  ఆలోచన కూడా రానివాడు  సమాజానికి దేశానికి ఏం వరగబెడతారు  పేరు ప్రతిష్టలకు తప్ప  వేరే సమాజంలో అమాయకులను దోచుకోవడానికి వేసే  వేషాలు తప్ప  మరొక రా నాకు అనిపించడం లేదు  అని నాకు  అభినందనలు చెప్పింది  నేను బయలుదేరి బయటకు వస్తుంటే  పిల్లలంతా గేటు వరకు వచ్చి నన్ను  పంపించడం  గమనిస్తే నా జన్మ ధన్యమైనట్లుగా అనిపించింది  వారినందరినీ ఎంత విజ్ఞానులుగా చేయాలని  గట్టి ఆలోచనతో బయటపడ్డాను.


కామెంట్‌లు