మన గురువు ప్రకృతి (6);- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ప్రతి ఇంట్లోనూ బల్లులు  తప్పకుండా ఉంటాయి  దాని గురించి నానా రకాల కథలు అల్లుతారు  బల్లి శాస్త్రం అంటూ ప్రత్యేకంగా దాని ప్రతి ఉనికిని గమనించి  చెప్పినవారు లేకపోలేదు. అది మనిషి ఏ భాగం మీద పడితే ఆ భాగానికి సంబంధించిన నష్టం ఏదో జరుగుతుంది అని ఆ నష్టాన్ని కూడా చెప్పినవారు  ప్రత్యేకంగా చిన్న గ్రంధాన్ని వ్రాశారు  కానీ మీరు గమనించినట్లయితే అది ఏం చేస్తూ ఉంటుంది. రాత్రులు వెలుగు ఎక్కడైతే ఉంటుందో  ఆ దీపం చుట్టూ కొన్ని క్రిములు వ్యాపించి ఉంటాయి. వాటిలో కొన్ని మంచి చేయవచ్చు మరికొన్ని చెడు చేయవచ్చు  ఈ బల్లి వాటిని జాగ్రత్తగా గమనిస్తూ  ఎలాంటి శబ్దం  లేకుండా ఆ క్రిములు గమనించకుండా వాటి వెనుకకు వెళ్లి  నాలుకతో లాగి తినడం వల్ల  ఆ ఇంటికి మంచే జరుగుతుంది తప్ప చెడు జరగదు  కనుక  ప్రకృతి ప్రసాదించిన ఏ జీవీ అనవసరమైనది కాదు అని మనకు తెలియాలి.
వ్యవసాయం చేసే రైతును పరిశీలించినట్లయితే  తన పొలంలో  పాము ఆకారంలో ఉండే చిన్న ప్రాణి  పొలంలో ఉన్న మట్టిని తింటూ ఆ మట్టిని విసర్జిస్తూ  రైతుకు ఎంతో సహకారిగా ఉంటుంది  చాలాకాలం రైతుకు కూడా ఆ విషయం తెలియదు  దానిని వానపాము అంటారు  వానాకాలంలో ఎక్కువగా  వచ్చే ప్రాణి  అది చేసే ప్రక్రియ వల్ల భూమి  బాగా సారవంతమవుతోంది అని శాస్త్రజ్ఞులు చెబుతారు  అంత చిన్న ప్రాణి చేసే సహకారం  రైతుకు ఎంతో ఉపకారంగా ఉంటుంది  సామాన్యంగా ఏ పొలంలోనైనా కలుపు మొక్కలు పెరుగుతూ ఉంటాయి  అవి ఎందుకూ పనికిరావు  కానీ రైతు బాగా ఆలోచించి చేనుకు నీరు పెట్టి  ఆ కలుపు మొక్కలతో సహా  దుక్కి దున్నడం వల్ల  ఆ పనికిరాని మొక్కలు కూడా పొలానికి ఎరువుగా పనికొచ్చి  పంటలు ఎక్కువ పండే అవకాశం ఏర్పడుతుంది.
మనం బజారులో వెళు తున్నప్పుడు కొన్ని విషయాలను గమనిస్తూ ఉంటాం  ఎవరైనా అందమైన అమ్మాయి వయసులో ఉన్న  అమ్మాయి కనిపించగానే చాలామంది  అందాల బొమ్మ  బాపు బొమ్మలను గీస్తే ఎలా ఉంటుందో ఈమె అలా ఉంది అని పొగుడుతూ ఉంటారు. ఆమెను మించిన సుగుణాల రాసి మరొక్కరు ఉండరు అంటూ పొగడ్తలకు దిగుతారు  అదే మన అమ్మాయి వాళ్ళ ముందు నడిచి ఏడుస్తూ ఉంటే  వాడికి నచ్చకపోతే  మరి భాగవతంలో చెప్పిన కుబ్జలాగా ఇంత ఘోరంగా ఉంది ఏమిటిరా అందం లేకపోయినా పరవాలేదు సౌందర్యం లేకపోతే జీవితం నాశనం అయిపోతుంది. ఈ అమ్మాయిని చూస్తుంటే అలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి  అంటూ నడుస్తూ ఉంటారు. కనిపించిన ప్రతి ఆడపిల్లను ఇలా అనడం అలవాయితీ వాళ్లకు.


కామెంట్‌లు
Popular posts
చిత్రాలు ; ..జ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భారత్ నగర్ (మూసాపేట)- హైదరాబాద్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
చిత్రాలు ; జి.జీవనజ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భరత్ నగర్ హైదరాబాద్
చిత్రం
తెలివితేటలు!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం