తండ్రి బాధ; - డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఈ ప్రపంచ స్థితి చాలా విచిత్రమైనది  ప్రేమను పంచిన చోటే విరహాన్ని పెంచుతుంది.  మమకారాన్ని పెంచిన చోటే దానిని కూకటి వేళ్ళతో సహా ప్రకటిస్తుంది  ఈ రెంటినీ సమపాళ్లలో అర్థం చేసుకొని  ఏ చిన్న సమస్య వచ్చినా దానికి తగిన పరిష్కారం ఆలోచించి  దానికోసం ప్రయత్నించాలి తప్ప  బాధపడుతూ కూర్చుంటే తన ఆరోగ్యం కూడా దెబ్బతిని పోతుంది  కనక బాబును  సాధన కోసం పంపి  వారం రోజులకు 10 రోజులకు  ఒకటి రెండు సార్లు వెళ్లి చూసి రావడం  తర్వాత 15 రోజులకు 20 రోజులకు  అలా నిదానంగా ఈ ఐదు నెలలు గడపడం  అలవాటు చేసుకున్నట్లయితే  తన మానసిక స్థితి బాగుంటుంది  బాబు భవిష్యత్తు  బాగుపడుతుంది  ఆ సమన్వయపరచుకోవడం అనేది మన మనసు మీద ఆధారపడి ఉంటుంది. ఇది ప్రతి తల్లి అనుభవించే బాధే.
తండ్రుల మనస్తత్వం మరొక రకంగా ఉంటుంది  మనుషుల పుట్టుకే  రకరకాల మనస్తత్వలతో కూడినదై ఉంటుంది  దానికి తగినట్లు  చాలా తక్కువ మందిలో ద్వంద్వ ప్రకృతి ఉంటుంది  వారు అనుకుంటున్నది ఒక రకంగా ఉంటుంది బయట అనేది మరొక రకంగా ఉంటుంది  తను ఊహించిన దానికి చేస్తున్న దానికి సంబంధం ఉండదు  దూరంగా వాళ్ళ కొడుకు మీద ప్రేమ లేకుండా ఉంటుందా ఏ తండ్రికి అయినా  దానిని బయటకు చెప్పుకోడు కొడుకుకు పెళ్లి  అయిన తర్వాత పిల్లలతో కాలక్షేపం చేస్తూ హాయిగా  సుఖంగా గడపాలన్న  ఆలోచనతో ఉంటారు ఆయన. బిడ్డకు సంతాన ప్రాప్తి లేకపోతే  ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఓపిక పట్టి  నేరుగా తన దగ్గరికి వెళ్లి  ఆసుపత్రికి వెళ్లి  పరీక్షలు కూడా చేయిస్తాడు.
ఆ పరీక్షలలో కూడా  వీరికి సంతాన ప్రాప్తి లేదు అని తెలుసుకున్న తరువాత  తన బిడ్డకు మరొక వివాహం చేయాలనుకుంటాడు  కానీ కొడుకు  ఇప్పటి నీ కోడల్ని ఏమిటి చేస్తావు అనడానికి సమాధానం ఇవ్వగలరా  ఈ సంతానలేమికి కారణం  ఆమె అని మీరు ఎందుకు అనుకుంటున్నారు నేను కాకూడదా  మీరు బలవంతంగా మరో వివాహం చేసిన తర్వాత ఆమె కూడా పిల్లలు లేకపోతే  ఆ తర్వాత మరొకరు మరొకరు ఇలా ఎంతమందిని చేస్తారు నాకు  ఒకసారి ఆలోచించండి  ఇప్పుడు నీ కోడలు వదిలేసి మరొకరితో నేను కాపురం చేస్తే  ఈమె జీవితం ఏమవుతుంది  మరొక వివాహం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుందా  అలా చేస్తే వచ్చే పురుషుడు ఎవరైనా ఉంటారా ఈ విషయం తెలిసి మీరు బజారు పడాల్సిందే కదా  ఆలోచించి  ఈ ప్రయత్నాన్ని విరమించుకోండి అని సలహా ఇచ్చిన తర్వాత  ఇంకా కసి పెరుగుతుంది తండ్రికి.


కామెంట్‌లు