అందమైన తెలంగాణ ఊరు,పచ్చని పైర్లు,చెట్టు,చేమ, వాగులు,వంకలు,గాలి,నీరు, అక్కడి బాష,యాస,ప్రేమ,
బంధం, అనుబంధం,కట్టు, బొట్టు,బోనం,మానం, మర్యాద,పరువు,పంతం, రీతి,రివాజు, చావూ పుట్టుక, పండుగ, ఆటాపాటా, సంతోషం, దుఃఖం....అన్నీ కలిపితే 'బలగం' సినిమా.అది భావోద్వేగాలతో, గుండెను, పిండి కంట తడి పెట్టించే దృశ్య కావ్యం.
దూరమైపోతున్న, పేగు బంధాలను, దగ్గర చేసి,కలహించుకుంటున్న కుటుంబాలను ఆలోచింపజేసే ఒక మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా ఈ బలగం.జబర్దస్థ్ వేణు ఈ చిత్రానికి అద్భుతంగా దర్శకత్వం వహించి,తన ప్రతిభను చాటుకున్నాడు.
అప్పట్లో ఒక ఇంటికి మన ఆడబిడ్డను పంపించేప్పుడు అటు ఏడు తరాలు,ఇటు ఏడు తరాలు చూడడంతో పాటు,వాళ్ళది పెద్ద బలగం అనీ గొప్పగా చెప్పుకునే వాళ్ళు.కాలక్రమేణా ఆ పరిస్థితులు మారిపోయాయనుకోండి.ఈ సినిమా క్లైమాక్స్ సీన్ చూస్తే,ప్రతి ఇంట్లో అన్నదమ్ముల, అక్క చెల్లెళ్ల మద్య ఏమైనా విభేదాలు ఉంటే పటాపంచలు అవుతాయనడంలో ఎలాంటి అనుమానం లేదు. సినిమా క్లైమాక్స్ లో, ఒగ్గు కథ,శారద కళాకారులు కొమరయ్య అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ, చివరి ఇరవై నిమిషాలు ఆలపించిన జానపద నేపధ్య గీతం చాలా హృద్యంగా ఉంది.హాలులో కూర్చున ప్రతి ఒక్కరూ బరువైన హృదయాలతో, బయటికి రావడం కనిపించింది.ముఖ్యంగా చివర్లో ఉగ్గు కథ గాయని,తన గొంతులో,ఆర్ద్రత, ఆవేదనను,పలికించిన తీరు చూస్తే ఏడుపు రాక తప్పదు.
అది రాజన్న సిరిసిల్లా జిల్లా,కోనరావు పేట, మండలంలోనీ,కొలనురు గ్రామం.ఆ ఊరి నివాసి గాజుల కొమురయ్య అకస్మాత్తుగా చనిపోతాడు.ఆయనకు ఐలయ్య,మొగిలయ్య, లక్ష్మి... ముగ్గురు సంతానం.పిల్లలు చిన్న గున్నప్పుడే భార్య చనిపోతే,తానే అన్ని అయి సాకాడు.మనవడు సాయిలు ఈ సినిమా హీరో, అప్పులు చేసి
వ్యాపారాలు పెట్టి,నష్టపోయి,అప్పిచ్చినోళ్ళకు కనబడకుండా తిరుగుతుంటాడు.రెండవ కొడుకు మొగులయ్య భార్యతో కలిసి బతుకు తెరువు కోసం సూరత్ వెళ్ళిపోతాడు.ఇంటికి వచ్చిన అల్లుడికి మూలుగ బొక్క,వేసి అన్నం పెట్టనందుకు, అల్లుడికి మర్యాద చేయలేదని,అలిగి,అల్లుడు నారాయణ ఇటెంకల కూడా చూడలేదు.బిడ్డ లక్ష్మి పుట్టింట్లో చేయి కడగక ఇరవై ఏళ్లు దాటింది. లక్ష్మి కి ఒక బిడ్డ ఈ సినిమా హీరోయిన్ సంధ్య.
చావూ పుట్టుకలు రెండూ పండగలే మన తెలుగు రాష్ట్రాలలో.కొమరయ్య చావుని కథగా మలిచి
రెండు గంటల పాటు మనల్ని మన,మన ఊర్లోకి తీసుకెళ్ళిన ఘనత డైరెక్టర్ వేణుకే దక్కింది.ఎక్కడైనా చావు తంతు ఒకే రకంగా ఉంటుంది.ఈ సీనిమాలో కూడా కొమరయ్యను శ్మశానానికి తీసుకెళ్ళిన తీరు అద్భుతంగా చిత్రీకరించారు.కాశర్ల శ్యాం రాసిన పాటలు
ఆ సినిమాను ఎంతో ఎత్తుకు తీసుకెళ్ళాయి.
ఎవరు చనిపోయినా కూడా మూడొద్దులు,ఐదొద్దులు,పది దినాలు చేయాలనేది రివాజు.మూడొద్దుల దినం నాడు కొడుకులు, కోడళ్ళు కొమరయ్య కు ఇష్టమైనవన్నీ వండి కాష్టం దగ్గర పెడితే కాకులు వచ్చి ముట్టుకోకపోవడంతో, అసలు సమస్య మొదలవుతుంది.మామూలుగా అన్నాన్ని కాకులు ముట్టుకోవడం లేదు అంటే, చనిపోయిన మనిషిలో ఏదో రంది ఉన్నట్లు.శ్మశానికి వెళ్ళిన అందరూ మొక్కుతారు, కానీ కాకులు ముట్టవు.ఊర్లోలంతా ఈ కుటుంబం గురించి తలోరకంగా మాట్లాడుకోవడం మొదలు పెడతారు.తరువాత ఐదొద్దుల దినం బిడ్డ వండి తండ్రికి పెట్టాలి.ఐలయ్య, నారాయణ బావబామర్ధులకు మాటల యుద్ధం జరిగి, ఒకళ్ళు నాలుగు మేకలంటే, ఇంకొకళ్ళు పది మేకలను కోస్తామనీ సవాలు విసురుకొనీ, అల్లుడు నారాయణ ఐదొద్దుల దినానికి మేకలు కోసి అన్నం పెట్టినా కాకులు ముట్టవ్.
అత్తింట్ల పంచభక్ష్య పరమాన్నాలు తింటున్న పుట్టింట్ల తినే ఎల్లిపాయ కారం మెతుకులే రుచి....కొమరయ్య బిడ్డ లక్ష్మి ఇటు అన్న ఐలయ్య అటు భర్త నారాయణ పంతాల మద్య నలిగి పోయే సన్నివేశాలు... చివరికి లక్ష్మి బిడ్డ ఏడుస్తున్న తన తల్లితో, నాకు పెళ్ళయ్యాకా ఆ వచ్చేటోడు నన్ను పుట్టింటికి పంపకపోతే, అప్పుడు తెలుస్తుందమ్మా,ఆ బాధేమిటో నాన్నకు..అని అంటుంది.ఆ మాటలు విన్న నారాయణ ఆలోచనల్లో పడతాడు.అప్పుడు రియలైజ్ అవుతాడు.
అన్న అంటే తండ్రి తరువాత తండ్రి లాంటోడు.అన్నకు కష్టం వస్తే, తమ్ముడు, తమ్ముడికి కష్టం వస్తే అన్న చూసుకోవాలని,అన్న ఇంటికి పెద్ద దిక్కయి, తోడబుట్టిన వాళ్ళను కన్న బిడ్డల్లా కడుపులో
పెట్టుకోవాలనీ, గొడవలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఉండాలనీ కొమరయ్య మాతో పలికిస్తున్నాడనీ ఆ ఉగ్గు కథ గాయని ఆవేదనతో పాడిన పాటతోనే సినిమా ముగుస్తుంది.
చిత్రం ప్రారంభంలో మగ్లీ పాడిన ఊరు.. పల్లెటూరు...పాటలో పల్లెటూరి అందాలను చాలా అందంగా చూపించారు.సంగీత దర్శకుడు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది.ఈ కథ ఒక తెలంగాణకు చెందినదే కాదు.దేశంలో ప్రతి ఒక్క కుటుంబానికి సంబంధినది.ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే
సినిమా ఈ బలగం.వీలయితే మీరూ చూడండి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి