ఏ కఠిన పదజాలాన్నో కావ్యాలంకారాల్నీ,అసహజ పండితినీ,ఎరువు తెచ్చుకోక, హృదయంలో నుంచి వచ్చే ప్రేమకీ,అందానికి, రంగులు పూయక స్వచ్చంగా, సూటిగా పాడే పాటల కన్నా కవిత్వం ఎక్కడుంటుంది?
ఎప్పుడూ నా నిశ్చితాభిప్రాయం ఏమిటంటే సులభమైన భాషలో చెప్పడానికి శక్తి లేని వాడే కష్టమైన బాషను ఉపయోగిస్తాడనీ.వచనంలో చెప్పలేని వాడు పద్యం రాస్తాడనీ అన్నారు చలం,ఒక పుస్తకానికి రాసిన పీఠికలో.నిజమే వచన కవిత్వంలో భావ వ్యక్తీకరణ, స్వేచ్ఛ, సూటిగా, సున్నితంగా,చెప్పే విషయం, పామరులను సైతం చేరుతుంది.పద్యంలోనీ వ్యాకరణాది అలంకారాలను, అర్థం చేసుకునే వారి సంఖ్య ఈ ఆధునిక యుగంలో చాలా తక్కువ.
సినిమా పాటల్లో సాహిత్యం కూడా కవిత్వమే, అయినా ప్రజల్లో అంత ఆదరాభిమానాలను పొందడానికి కారణం ఏమిటి?.. అంటే ఆ సాహిత్యానికి బాణీ కట్టి చెవులకు ఇంపుగా సంగీతాన్ని అందించడం వల్ల సినిమా పాటలకి మంచి గుర్తింపు లభిస్తుంది.అదే ఒక కవి సమ్మేళనంలోనో,ఒక కవి సంగమంలోనో,ఒక కవి తనలోని ఘర్షణనో, తనలోని జ్ఞాపకాలనో,తన హృదిలో పలికే శృంగార రసాలనో, ప్రకృతినో,ఆకాశాన్నో,జీవాన్నో,జీవితాన్నో,కలగంటూ, కాల్పనిక ప్రపంచంలో విహరిస్తూ,విరహిస్తూ, ఒక్కొక్క సారి ప్రశ్నిస్తూ, నిరసిస్తూ,హక్కుల కోసం కలహిస్తూ, ఆవేదనను వెళ్ళగక్కుతూ, ఆవేశానికి అక్షర రూపం ఇస్తూ, అమ్మా నాన్న,అక్క,అన్న, భార్యా పిల్లల బంధాలకు విలువనిస్తూ, భయపెట్టే సమాజాన్ని నిలదీస్తూ, స్త్రీ...తక్కువ కాదనీ, పురుషులతో సమానమనీ పోరాడుతూ,రాసే కవిత్వం ఎంతమంది చదువుతున్నారు... లేదు చదవడం లేదు.
ఒక్కప్పుడు న్యూస్ పేపర్ లో సాహిత్యం పేజీ అనేది ఉండేది కాదు.కాలక్రమేణా కొన్ని పత్రికలు కవితలు, కథలూ, సాహిత్య వ్యాసాలు ప్రచురించసాగాయి.అందులో వచ్చే కవితలు,కథలూ కొందరివి మాత్రమే వచ్చేవి.అలా ఆ కవులు, రచయితలు పేరు గాంచి, ప్రముఖులు అయ్యారు.ఆ రోజుల్లో కూడా ఎంతో మంది ప్రతిభ ఉండి వెలుగులోకి రాక,మరుగున పడిన కవులు, రచయితలు అనేక మంది ఉన్నారు.అందులో మా అక్కయ్య మంజుల కూడా ఉంది.తొంబైవ దశకంలో వార పత్రికలు,డైలీ పత్రికలలో,ఒక కవిత గానీ,ఒక కథ గానీ ప్రచురితం కావాలంటే,దానిలో విషయం ఉన్నా లేకపోయినా లోపాయికారంగా కొన్ని వ్యవహారాలు, ఒప్పందాలు జరగాల్సిందే.అంటే నేను అప్పటికే ప్రముఖులైన వారి గురించి మాట్లాడడం లేదు.కొత్తగా ఎంట్రీ ఇచ్చే వారి గురించి చెపుతున్నాను.
ప్రస్తుతం ప్రపంచం అంతా సోషల్ మీడియా
ప్రభంజనం నడుస్తుంది.తాము రాసింది,ఏ పత్రికలోనో,మరేదో వార పత్రికలోనో, రావాలని ఎవరూ ఆలోచించడం లేదు.ఫేస్బుక్ వాల్ నీ, ఆధారంగా చేసుకుని దాదాపు పది నుంచి పదిహేను సాహిత్య గ్రూపులు ఉన్నాయి.ఆ గ్రూపు అడ్మిన్ లు ఎంతో మంది వర్ధమాన కవులను, రచయితలను ప్రోత్సహిస్తున్నారు.
కవిత్వ పోటీలు నిర్వహిస్తున్నారు,బహుమతులను ఇస్తున్నారు.ఒకప్పుడు ఒక పుస్తకం అచ్చు వేయాలంటే వ్యయంతో కూడిన వ్యవహారం.కానీ ప్రస్తుతం వందల పుస్తకాలు ముద్రణలతో పాటు, ఘనంగా పుస్తకావిష్కరణ సభలను కూడా చేస్తున్నారు.సరే అవి ఎంత మంది కొని చదువుతున్నారని తన విషయం పక్కన పెడితే,ఆ పుస్తకం రాసిన కవికి ఆత్మానందం కలుగుతుంది.తాను రాసిన అక్షరాలను ప్రింటింగ్ లో చూసుకున్నప్పుడు,ఆ పుస్తకం తనవారందరికీ పంచినపుడు, మిత్రులు, బందువులు,అందరి ఇళ్ళల్లో తన పుస్తకం ఉండడం సం
తోషంగా ఫీల్ అవుతాడు.
సోషల్ మీడియాలో దాదాపుగా పదిహేను సాహిత్యానికి సంబంధించిన గ్రూపులు ఉన్నాయి.ఒక్కొక్క గ్రూపులో దాదాపుగా ఎనిమిది నుంచి పన్నెండు వేల మంది సభ్యులు ఉన్నారు.సభ్యుడు అయ్యాడంటే, అతనికి కవిత్వం మీద ఆసక్తి ఇన్నట్లే కదా.అక్కడే వస్తుంది సమస్య.రోజూ ఎంత మంది సభ్యులు,తమ, తమ గ్రూపుల్లోకి వెళ్లి మిత్రులు, సహచరులు రాసే కవితలను చదువుతున్నారు? ఎంత మంది ఆయా కవితల్ని చదివి లైక్ చేయడమో, కామెంట్ చేయడమో చేస్తున్నారు? నేను గత కొన్ని నెలలుగా దాదాపు అన్ని గ్రూపులను గమనిస్తున్నాను.అత్యదిక స్థాయిలో అంటే రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది రెగ్యులర్ గా స్పందిస్తున్నట్లు తెలుస్తోంది.అంటే పన్నెండు వేల మందిలో కేవలం రెండు వందల మంది.అంతే కాకుండా స్పందించకుండా కేవలం పోస్టును చూసేవాళ్ళు యాభై నుంచి తొంభై మంది ఉంటారు.అంతా కలిసి మూడు వందలు... పోనీ అయిదు వందల మంది.మిగితా వాళ్ళు అటు లైక్, కామెంట్స్ చేయకుండా, కనీసం గ్రూపులో ఎవరు ఏం రాస్తున్నారో చూడకుండా అలా తటస్థంగా ఉండడం ఎంత వరకు సమంజసం.అలాంటప్పుడు గ్రూపులో కొనసాగడం ఎందుకు?రోజులో లేదంటే ఏ ఆదివారమో,గ్రూపులోకి వెళ్లి చూసి ఆ కవితలకు స్పందిస్తే,ఆ కవులను ప్రోత్సహించేవారమవుతాం.వాళ్ళు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఇంకా అద్భుతంగా రాస్తారు... రాణిస్తారు..

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి