మదమెరిగిన మానవుడు;-ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 ఈ భూమి మీదకు ప్రతి ఒక్కరు దిగంబరంగానే వస్తారు  వయసు పెరుగుతున్న కొలది  ఎన్నెన్నో భావాలు మనసులో అలముకుంటే ఆ వచ్చే ఆలోచనలు మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు  ఏ పని చేస్తే దాని ఫలితం  దాని గానే వస్తుంది  అంతే తప్ప హత్య చేసి  నన్ను ఉరి తీయవద్దు అంటే ప్రభుత్వం ఊరుకుంటుందా  కనుక మనిషి చెడు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలని  ప్రభుత్వం ఎన్నో చట్టాలతో కట్టుదిట్టం చేసింది  అయినా వ్యక్తులు పక్క దోవలు తొక్కుతూనే ఉంటారు.  కొంచెం  వయసు జరిగిన వాడు ఆలోచించేది  ధన సంపాదన గురించి  ధనము లేక పోతే ఎందుకూ పనికిరామన్న  అభిప్రాయం ప్రతి ఒక్కరిలో ఉంది. అందుకే మన పెద్దవాడు  ధన మూల మిదం జగత్  అని చెబుతూ ఉంటారు.
ఏ మనిషికైనా జీవించడానికి సరిపడిన ఆర్థిక వనరులు ఉన్నట్లయితే  ప్రశాంత చిత్తుడై జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు  దానికి వ్యతిరేకంగా  తనలో తాను అనుకున్న దానికన్నా  ఎక్కువ ధనాన్ని సంపాదించి  లేదా వేరే మార్గాల ద్వారా వచ్చి తన దగ్గర చేరితే  ముందు అతనిలో మదం పెరుగుతుంది  ఎప్పుడైతే మదమాత్సర్యాలకు  బానిస అయ్యాడో అప్పుడు  తనకు తెలియకుండానే చెడ్డ అలవాటులన్నీ తన దగ్గరకు వచ్చి చేరతాయి  ఆ సమయంలో అతను ఏ పని ఎలా చేస్తున్నాడో అన్న విషయాలను కూడా ఆలోచించే స్థితిలో ఉండడు  ఇలాంటి వారిలో ఎక్కువగా  తాగుడు వ్యభిచారం లాంటి  గుణాలు అన్నీ వచ్చి చేరతాయి ఇవన్నీ చేరిన మరుక్షణం అతని జీవితం పతనం  అవడం ఖాయం.
ఈ స్థితి కలిగిన మరుక్షణం  అతని దగ్గర ఉన్న ప్రతి పైసా  తన దగ్గర లేకుండా వెళ్ళిపోతుంది  దానితో  మధ్యలో వచ్చిన ఆ మదం  అణిగిపోతుంది  ఎప్పుడైతే అది తన నుంచి దూరమైపోయిందో  తనకు అలవాటైన దురాభ్యాసములు కూడా తనకు దూరమవుతాయి. అందుకే మన పెద్దలు గొప్ప  నానుడి చెప్పారు  నడ మంత్రపు సిరి  నరం మీద  లేచిన కురుపు  అని  సామాన్యంగా చాలామందికి కురుపులు సహజ  అవి త్వరగానే వారి  శరీర స్థితిని బట్టి తగ్గిపోతాయి  ఎవరికైనా నరం మీద అలాంటిది ఏర్పడినట్లైతే  అంత త్వరగా తగ్గిపోవడం జరగదు కనుక అలాంటి నడమంత్రపు సిరి వచ్చిన ఏ ఒక్కరినీ నమ్మవద్దు  వారి వద్దకు వెళ్ళవద్దు అని కూడా మన పెద్దలు మనకు  జాగ్రత్తలు చెబుతూ ఉంటారు. అనుభవంతో చెప్పిన మాట  ప్రతి ఒక్కరూ ఆచరించాలి కదా  వేమన రాసిన ఆ పద్యం ఒక్కసారి చదవండి.

"ధన మెచ్చిన మదమెచ్చును  మదమెచ్చిన దుర్గుణంబు    మానక నెచ్చున్  
ధనమొడిగిన మదముడుగును  మదముడిగిన దుర్గుణంబు మానును వేమ..."


కామెంట్‌లు
Popular posts
చిత్రాలు ; ..జ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భారత్ నగర్ (మూసాపేట)- హైదరాబాద్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
చిత్రాలు ; జి.జీవనజ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భరత్ నగర్ హైదరాబాద్
చిత్రం
తెలివితేటలు!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం