గురువుకు అర్ధం;- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఇవాళ సమాజంలో గురువు అనే శబ్దం చాలా తేలిక అయిపోయింది  రిక్షా తొక్కే కార్మికుని పిలిచి  గురు నేను పాలనచోటికి వెళ్లాలి  తీసుకెళ్ళు అంటాడు. స్నేహితుడు మాట్లాడుకునేటప్పుడు కూడా  నువ్వు చెప్పింది అక్షరాల  నిజం గురువు అని అతనిని అభినందిస్తూ ఉంటారు. వీరిలో ఎవరికైనా గురువు అన్న శబ్దానికి అర్థం తెలుసునా  బడిలో మనకు పాఠాలు చెప్పే వారిని  గురువుగా భావిస్తాం.  మన దృష్టిలో గురువు అంటే ఆయనే  కారణం మనకు అక్షర జ్ఞానాన్ని ఇచ్చి  లోక రీతిని తెలియజేసే మహానుభావుడు కనుక  కానీ గురువు అంటే  గు అంటే చీకటి రు అంటే కూకటి వేళ్ళతో పెకలించడం  అజ్ఞాన తిమిరాంధకారంలో ఉన్నవాడిని సుజ్ఞానిగా చేసి  అతనికి వెలుగులను ప్రసాదించువాడు  అని శబ్దార్థం. ఏ కొంచెం చదువుకున్నవాడికైనా వ్యాకరణం తెలుస్తుంది  మనం పద్యాలు చదువుతున్నప్పుడు దానిలో గురువు, లఘువు అన్న శబ్దాలు  ఉపాధ్యాయుడు  మనకు ఉపాధ్యాయులు చెప్తారు  ఒక మాత్ర కాలంలో ఉచ్చరించేది  లఘువు. రెండు మాత్రలు అయితే గురువు, మూడు మాత్రలైతే  ప్లూతము  అలాగే నాలుగు ఐదు మాత్రలతో ఉచ్చరించే శబ్దాలు ఉన్నాయి  అయితే ఈ పద్యాలలో ఉన్న విశేషాలకు గాని, గురువుగాని ఎప్పుడూ దాని స్థానంలో అది ఉండదు అవి మారుతూ ఉంటాయి. లఘువు ప్రక్కన గురువు ఉన్నది కనుక  లఘువును  లఘువుగా గురువును గురువుగా మనం  ఉచ్చరిస్తాం. గురువు ప్రక్కన ప్లుతం ఉంటే  అది గురువు పాత గురువు లఘువు అవుతుంది. దీనిని భౌతికంగా చెప్పాలంటే  సన్నగా అతని ప్రక్కన లావు మనిషి వుంటే అతను గురువు  అతని ప్రక్క చెరువు ఉంటే అది గురువు  దాని ప్రక్క నది ఉంటే అది గురువు  నది ప్రక్క సముద్రం ఉంటే  అది గురువు  సముద్రం ప్రక్కన ఆకాశం ఉంటే  ఆకాశమే గురువు అవుతుంది  ఇలా మనం ఒక్కొక్క దానిని ఒక్కొక్క దానితో పోల్చుకుంటూ వెళ్లిపోతే  ఇక పోల్చడానికి ఏదీ లేదు  అని చెప్పుకునేదే బ్రహ్మ పదార్థం  ఇది ఆత్మకు పరమాత్మకు ఉన్న సంబంధం  ఆత్మలో పరమాత్మ కలవడాన్ని  ఈశ్వర సాక్ష్యాత్ కార మహోత్సవం  ఈ విషయం మొత్తం మీద  దేనితోనో పోల్చడానికి అలవికాని  ఏకైక  పదార్థం దైవత్వం  వీరిని పరమాత్మ అని చెప్పవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో ఉచ్చరించిన  అది వారికే చెందుతుంది అని వేమన చెప్పే విధానం  ఆ పద్యాన్ని మీరు చదవండి.

"గురుడనగా పరమాత్ముడు  పరగంగా శిష్యుడనంగా పటు జీవుడగున్  
గురు శిష్య జీవ సంపద  గురుతరముగ గూర్చునతడు గురువగు వేమ...


కామెంట్‌లు