మన కంటికి ఏది కనిపిస్తుందో అదివిద్య. కంటికి అగమ్య గోచరంగా ఉన్నది శాశ్వతం ఇది పూర్వీకులు మనకు చెప్పిన విషయం ఈనాడు ప్రపంచంలో ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా అన్ని ఏర్పాట్లను చేసుకున్నాం. ఏ పదార్థం కావాల్సి వచ్చేలా క్షణాలలో మన ముందు వాడుకొని ఎంతో సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఇతర గ్రహాలను కూడా మనం పరిశీలనగా చూసి కొత్త విషయాలను నేర్చుకుంటున్నాం. అది ప్రపంచానికి తెలియజేస్తున్నాం కూడా. ఇవన్నీ నిజాలే అన్నప్పుడు అసలు ఎలా కనిపిస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి అని ఒక్కసారి ఆలోచించినట్లయితే రాతి యుగంలో బట్టలు కట్టడం కూడా తెలియని అజ్ఞానంలో ఉన్న మనుషులు ఎక్కడ ఏ జంతువు కనిపిస్తే దానిని వేటాడి చంపి దాని మాంసం ద్వారా వారి ఆకలి తీర్చుకున్నారు. ధ్వని ఎక్కడ నుంచి వస్తుందో మనకు ఎలా వినపడుతుందో తెలియదు గాలి వల్ల స్పర్శ ఎలా ఏర్పడుతుందో చెప్పడం కష్టం మానవుడు కాక తీయంగా అడవిలో రెండు ఎండు కొమ్మలు ఒకదాని నీ మరొకటి రాపిడి చేయడం వల్ల నిప్పు రావడానికి చూశాడు. దానిని మనం ఎందుకు సృష్టించలేము అని ముందు రెండు రాళ్ళను తీసుకొని ఒక దాని నుంచి మరొకటి బాగా తగిలినప్పుడు నిప్పు రవ్వ రావడం గమనించాడు తాను నిప్పు తయారు చేయాలన్న కోరికతో రెండు రెండు కొమ్మలను తీసుకొని బాగా రాపిడి చేయడం వల్ల నిప్పును సృష్టించి దానితో ఎలా జీవించాలో తెలుసుకున్నాడు. తాము వేటాడిన జంతువులను కాల్చి దాని రుచి చూసిన తరువాత తనకు ఫలితం దక్కినట్లుగా భావించాడు. పశువుల పాలు తీసి మొదట పచ్చిపాలు తాగడం మొదట పెట్టి తరువాత కాచి దాని ద్వారా పెరుగును సృష్టించాడు పెరుగును ఆహారంగానే తీసుకోవడం కాకుండా దానిలో ఉన్న పదార్థాలను వెతికి చూడాలన్నప్పుడు ఆ పెరుగును చిలికి దాని నుంచి వెన్న తీయడం మొదలుపెట్టాడు. దానిని చూసి నేతిని తయారు చేశాడు అలా ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మానవ ప్రయత్నం లేకుండా ఏది జరగదు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా రుజువు చేశాడు వేమన ఏకాగ్రతతో తాను ఏ తత్వాన్ని తెలుసుకోదలుచుకున్నాడో దానిని అనుక్షణం తడుచుకుంటూ పాటికి పది సార్లు దానికోసం ప్రేమిస్తే ఆ తత్వం ఏమిటో తనకు అర్థం అవుతుంది అనే వేమన చెప్పిన ఆ పద్యాన్ని ఒక్కసారి చదవండి.
తరువ తరువ బుట్టు తరువున ననలమ్ము తరువ తరువ బుట్టు ధతిని గృతము
తలప తలప బుట్టు తనువున తత్వంబు.."
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి