శరీర రక్షణ;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 ఈ మానవ శరీరం ఈ భూమి మీదకు వచ్చినది  తినడానికి నిద్ర పోవడానికి మాత్రమే కాదు  జీవిత ఆశయాన్ని సాధించడం కోసం ఈ భూ ప్రపంచం మీదకు ఎందుకు వచ్చాము, ఎలా వచ్చాము, ఎక్కడకు వెళుతున్నాం  ఎవరు తీసుకు వెళుతున్నారు  అన్న విషయాలను మలయాళ స్వామి  కఠోపనిషత్తులో నచికేతులు  యమధర్మరాజును అడిగి తెలుసుకున్న విషయం  దానికోసం ప్రయత్నం చేయాలి తప్ప  మిగిలిన ఏమి చేసినా  మానవ జన్మకు తృప్తి ఉండదు  శరీరమాధ్యం ధర్మసాధనం  అని మన పెద్దలు చెప్పిన సూక్తి  ఈ భూమి మీదకు ఈ శరీరం ఎందుకు వచ్చింది అంటే వారు చెప్పిన మాట  ధర్మాన్ని, సాధించడం కోసం ఈ శరీరాన్ని నీవు ఉపయోగించు  ధర్మ మార్గాన్ని తప్పి చరించవద్దు అని చెప్పడం కోసం ఆ నీతిని మనకు పెద్దలు బోధించారు. ఈ శరీరం ఎందుకు ఉపయోగించాలో తెలిసిన తరువాత  దాని గురించి సాధన చేయాలి తప్ప  చిన్న చిన్న ఆశలు కోరికలు పెట్టుకొని అవి నెరవేరడం కోసం  చేయకూడని పనులను కూడా చేస్తూ పోతే  ఈ శరీరం తట్టుకోలేదు  దానివల్ల అనేక రుగ్మతలు వచ్చి  ఈ శరీరం చిక్కి సల్యమై  ఎందుకూ పనికిరాకుండా పోతుంది. ఏది చేయడానికి నీవు ఇక్కడికి వచ్చావో ఆ పనిని చేయడానికి ఈ శరీరం నీకు సహకరించదు  అన్న విషయాలు జ్ఞాపకం పెట్టుకున్నట్లయితే  అనవసరమైన వాటి జోలికి వెళ్లకుండా  శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడం కోసం  మంచి అలవాట్లను నేర్చుకుని  వాటిని తప్పక అనుసరిస్తూ ఉన్నట్లయితే  మీ శరీరము మీ అదుపులో ఉంటుంది  ఎప్పుడైతే శరీరం తన అదుపులో ఉన్నదో మనసు చెప్పినట్లుగా వింటుంది  అప్పుడు ఈ ప్రపంచంలో సాధ్యం కానిది ఏదీ ఉండదు  అని మన పెద్దలు చెప్పే మంచి మాట.
ఈ మనసు ఎప్పుడూ నీ అధీనంలోకి వస్తుందో  అప్పుడు ఏ విషయ సాధన కోసం నీవు తపిస్తున్నావో దానిని గురించిన విషయ సేకరణకు  ముందుకు వస్తావ్  ఆ విషయాలను గురించి తెలిసిన పెద్దల సలహాలను స్వీకరించి  పెద్దలు చెప్పిన పద్ధతిలో నీ జీవితాన్ని నడిపినట్లయితే  తప్పకుండా  విజయాన్ని పొందగలవు  ఎప్పుడు మనసు  నిశ్చలంగా ఉంటుందో బుద్ధి దానికి సహకరిస్తుంది  మనసు బుద్ధి ఎప్పుడు సహకరించాయో అప్పుడు నీ శరీరం మొత్తం నీ అధీనంలో ఉంటుంది  అప్పుడు పెద్దలు చెప్పిన లక్షణాలను  తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు వేమన  తన అనుభవ జ్ఞానంతో చెప్పిన  వారి ఆటవెలదిని ఒక్కసారి చదివితే  విషయం పూర్తిగా మనకు అర్థమవుతుంది  దయచేసి ఒక్కసారి చదవండి.

"దేహము లెస్సగ నుండిన పోషణ తత్వంబులన్ని పొందుగ దెలియున్ దేహము బడలిక బడినను పోషణ తత్వములు (వచ్చి) పొందవు వేమ..."


.

కామెంట్‌లు