మక్తకోకిల పిలుపు
గానగంధర్వుల మలుపు
కవులకు సొగసు
తేనేటి విందుల కవితలు వలపు
రవి తేజో విరాట మకుటం
ముంగిల్లు ఆడే కొత్తదనం
తెలుగమ్మాయిల సొగసుధనం
షడ్రుచుల గొప్పదనం
కోయిల కూతల కవ్వింపు దినం
అది ఉగాది నవ సొగసుధనం
తెలుగు పండుగ మొదటి పండుగ
కవి , కవిత్రుల భావ తాళం
అజ్ఞాన చీకట్లు తొలగించు కమ్మదనం
ఆంధ్ర తెలంగాణ ల పరిమళత్వం
అకుంఠిత కవిత్వపు అమరత్వం
విజ్ఞాన విపంచిక సర్వస్వం
జ్ఞానముంగిరిల కవిత్వపు కావ్య ధనం
రైతన్నల ఆరాటం
తెలుగు అమ్మాయిల కోలాటం
కవి కవిత్వ వినసొంపు ధనం
కొత్త నూతన సంవత్సర ఆరంభ దినము
చిరునవ్వుల నవ్వుల కెంపుదనం
విజయాలు చేకూర్చు విజయలక్ష్మిల ఉగాది పర్వదినం
అదే మనందరి ఆశల జాగృతి వనం
----------------------------------------
: ఉగాది పండగ;-- యడ్ల శ్రీనివాసరావు విజయనగరం-చరవాణి: 9493707592-
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి